వరంగల్ ఎన్ఐటీ అరుదైన రికార్డ్.. వెయ్యి మందికి ప్లేస్‌మెంట్

by Disha Web Desk 19 |
వరంగల్ ఎన్ఐటీ అరుదైన రికార్డ్.. వెయ్యి మందికి ప్లేస్‌మెంట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్ ఎన్ఐటీలో చదివితే మంచి ప్యాకేజ్‌తో ఉద్యోగం సాధించవచ్చని విద్యార్థుల ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిరూపించింది. ఈ ఏడాది(2022-22) ఎన్ఐటీలో చదివిన వెయ్యి మంది విద్యార్థులు ఉద్యోగాలు పొంది చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో క్యాంపస్ డ్రైవ్ ద్వారా 250 కంపెనీల్లో 630 మంది బీటెక్ విద్యార్థులు, 386 మంది పీజీ విద్యార్థులు,‌ మరో 50 మంది విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు పొంది సత్తాచాటారు. 2019-20 సంవత్సరంలో 792 మంది, 2020-21లో 839 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందితే ఈ ఏడాది ఏకంగా 1016మంది ఉద్యోగాలు పొందారు. ఈ ఏడాది అత్యధికంగా ప్యాకేజీలు పొందిన వారిలో.. గౌరవ్ సింగ్, ప్రియాంష్ మహశ్వరీలకు రూ.62.50 లక్షల వేతనంతో పని చేస్తున్నారు. అంతేగాకుండా, రూ.20 లక్షల కంటే ఎక్కువ వేతనంతో 220 మంది ఉద్యోగం సాధించారు. అయితే, గేట్-2022లో కూడా వరంగల్ ఎన్ఐటీ విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం విశేషం.







Next Story

Most Viewed