బీజేపీలోకి కూకట్‌పల్లికి చెందిన కీలక నేత..?

by Disha Web |
బీజేపీలోకి కూకట్‌పల్లికి చెందిన కీలక నేత..?
X

దిశ, కూకట్​పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. రాష్ట్రంలో రోజు రోజుకు చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో కూకట్‌పల్లిలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కూకట్‌పల్లి నియోజకవర్గంలో మాస్​లీడర్‌గా పేరొందిన ఖనిజాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్​వడ్డెపల్లి నర్సింగరావు కుమారుడు వడ్డెపల్లి రాజేశ్వర్​రావు బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. వైఎస్సార్​హయాంలో ఓ వెలుగు వెలిగిన మాస్​లీడర్ వడ్డెపల్లి నరసింగరావు వారసుడు రాజేశ్వర్​రావు వైఎస్​జగన్‌తో అదే సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ గత రెండు దఫాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం సలహామండలి సభ్యులుగా కొనసాగుతున్నారు.

కూకట్​పల్లి వడ్డెపల్లిదే..

సుధీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వడ్డెపల్లి కుటుంబానికి కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో రాజేశ్వర్​రావు క్రీయాశీలక రాజకీయాలల్లో ఉంటే ప్రధాన​పార్టీలకు గట్టి పోటీ ఉండే అవకాశాలు లేక పోలేదు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా వడ్డెపల్లి రాజేశ్వర్​రావు కేంద్రంలోని ఓ పెద్ద నాయకుడితో టచ్‌లో ఉన్నారని, త్వరలో బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వడ్డెపల్లి రాజేశ్వర్​రావు బీజేపీలో చేరితే గత అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైన ఆ పార్టీకి కూకట్​పల్లిలో మరింత బలం చేకూరుతుందనడంలో సందేహం లేదు.

వడ్డెపల్లి రాజేశ్వర్​రావును కలిసిన బీజేపీ నేత

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్​రెడ్డి శుక్రవారం వడ్డెపల్లి రాజేశ్వర్​రావును ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. దీంతో వడ్డెపల్లి రాజేశ్వర్​రావు త్వరలో బీజేపీలో చేరుతున్నారన్న చర్చ బలంగా కొనసాగుతుంది. రాజేశ్వర్​రావు ఎప్పుడు అధికారికంగా బీజేపీలో చేరుతారో వేచి చూడాల్సి ఉంది.

కూకట్​పల్లిలో బీజేపీ పుంజుకుంటుందా...?

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూకట్‌పల్లిలో అధికార పార్టీ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసిన బీజేపీ గ్రేటర్​ఎన్నికలలో మూసాపేట్​ డివిజన్‌లో జెండా ఎగరేయడంతో ఆ పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపింది. గత అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీలో ఉన్న హరీష్​రెడ్డి గ్రేటర్​ ఎన్నికల ముందు బీజేపీలో చేరడం, మేడ్చల్​జిల్లా అర్బన్​అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత జరిగిన గ్రేటర్​ఎన్నికలలో అధికార పార్టీ నాయకులకు పోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం నియోజకవర్గంలోని అన్ని డివిజన్‌లలో గట్టి పోటీ ఇవ్వడంతో పాటు మూసాపేట్​డివిజన్‌లో విజయం సాధించారు. దాని తరువాత హరీష్​రెడ్డి, నియోజకవర్గం ఇన్‌చార్జి మాధవరం కాంతారావులు నియోజకవర్గంలో పాదయాత్రలు, సమస్యలపై పోరాటం చేస్తూ, బూత్​స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే కూకట్​పల్లిలో మంచి పట్టున్న వడ్డెపల్లి రాజేశ్వర్​రావు బీజేపీలో చేరితే ఆ పార్టీకి మరింత బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed