ఇక ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్ చేయొచ్చు..

by Dishafeatures2 |
ఇక ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్ చేయొచ్చు..
X

దిశ, ఫీచర్స్ : డిజిటల్ చెల్లింపులకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ, మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే పద్ధతుల్లో UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్)ఒకటి. UPI ఆధారిత పేమెంట్స్ చేయడానికి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి అనేక ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించుకునే అవకాశముంది. అయితే ఈ ప్లాట్‌ఫామ్‌లన్నింటికీ యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. కాబట్టి మీరెప్పుడైనా సిగ్నల్ లేని లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేని పరిస్థితుల్లో చిక్కుకున్నట్లయితే, డిజిటల్ లావాదేవీ చేయడానికి 123Pay లేదా USSD ఆధారిత UPI సేవను మాత్రమే ఉపయోగించుకునే అవకాశముంటుంది. కాగా ఈ పద్ధతుల్లో దేనికీ QR కోడ్ ఆధారిత పేమెంట్స్‌కు మద్దతు లేదు కాబట్టి, లావాదేవీ చేయడం కాస్త కష్టసాధ్యమైన పని. అటువంటి సందర్భాలలో వినియోగదారులకు సహాయం చేయాలనే లక్ష్యంతో, నేషనల్ పేమెంట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI లైట్ అనే కొత్త UPI సేవను ప్రారంభించింది. దీని విశేషాలేంటో తెలుసుకుందాం.

యూపీఐ లైట్ అనేది పేటీఎమ్, ఫ్రీచార్జ్, మొబిక్విక్ వంటి ఇతర ప్రముఖ డిజిటల్ చెల్లింపుల యాప్‌లలో కనిపించే విధంగానే ఆన్-డివైస్ వాలెట్ ఫీచర్. వాలెట్‌లో జోడించిన డబ్బు ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా స్మాల్ వ్యాల్యు పేమెంట్స్‌ను వేగంగా చేసేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ఈ క్రమంలోనే UPI లైట్‌తో ఏదైనా QR కోడ్‌ని స్కాన్ చేసి డబ్బులు చెల్లించవచ్చు. అయితే భారతదేశంలో రిటైల్ లావాదేవీల మొత్తం పరిమాణంలో కనీసం 75 శాతం (నగదుతో సహా) లావాదేవీలు తక్కువ (రూ. 100 విలువ) విలువ ఆధారిత పేమెంట్స్ కాగా మొత్తం UPI లావాదేవీల్లో 50 శాతం లావాదేవీలు రూ. 200 వరకు ఉంటుందని ఎన్‌పీసీఐ పేర్కొంది. ఈ మేరకు NPCI ఆఫ్‌లైన్ లావాదేవీలను రూ. 200 వరకు మాత్రమే అనుమతిస్తుంది. అంటే UPI లైట్ చెల్లింపు లావాదేవీ గరిష్ట పరిమితి రూ. 200 అన్నమాట.

NPCI UPI లైట్ లాంచ్‌కు సంబంధించిన నిర్దిష్ట తేదీని వెల్లడించలేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రత్యేక విభాగం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, UPI లైట్ ప్రారంభంలో మల్టిపుల్ బ్యాంక్స్ యాప్ ప్రొవైడర్స్‌తో జతకూడి పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభించబడుతుంది. ఆ తర్వాత అందరికీ అందుబాటులోకి వస్తుంది. యూపీఐ యాప్‌ని ఉపయోగించే ఏ యూజర్ అయినా 'ఆన్-డివైస్ వాలెట్' అని పిలిచే 'యూపీఐ లైట్‌'ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతా నుంచి UPI లైట్‌కి డబ్బులు యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, UPI లైట్ బ్యాలెన్స్ నుంచి డెబిట్ మాత్రమే అనుమతించబడుతుంది. UPI లైట్‌కి సంబంధించిన అన్ని క్రెడిట్స్ (రీఫండ్‌లు మొదలైన వాటితో సహా) వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చేయబడతాయి. UPI లైట్ బ్యాలెన్స్ మొత్తం పరిమితి రూ. 2,000. UPI లైట్‌లో నిధులను జోడించడం అనేది అదనపు ఫ్యాక్టర్ అథెంటికేషన్ (AFA) లేదా UPI ఆటో పే ఫీచర్‌ని ఉపయోగించి ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే అనుమతించబడుతుంది.

Next Story

Most Viewed