వారణాసి ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ.. విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు

by Disha Web |
వారణాసి ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ.. విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు
X

లక్నో: విపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని దేశంలో విపక్ష రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. కుటుంబ పార్టీలు ఎల్లప్పుడు సొంత లబ్ధి చేకూరే అవకాశాలు వెతుక్కుంటాయని ఆరోపించారు. శనివారం వారణాసిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. అంధ విపక్షాలు కేంద్రంపై వ్యతిరేకతను కొనసాగిస్తూ, నిరాశతో ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు.

వారి రాజకీయ భావజాలంలోనే నెగిటివిటీ ఉందని ఆరోపించారు. దేశం ముందు సవాళ్లు ఎదురైనప్పుడు, కుటుంబ పార్టీలు రాజకీయ ఆసక్తుల కోసం ఎదురు చూస్తాయి. భారత భద్రతా దళాలు, ప్రజలు సంక్షోభంలో ఉంటే, విపక్ష పార్టీలు పరిస్థితిని మరింత దిగుజారుస్తున్నాయి. మనం కరోనా మహమ్మారి సమయంలోనూ, ప్రస్తుత ఉక్రెయిన్ సంక్షోభం సమయంలోనూ ఇది గమనిస్తున్నాం అని అన్నారు. అపరేషన్ గంగా మిషన్‌తో కేంద్రం ఆలస్యం చేస్తుందని కాంగ్రెస్ అనవసర విమర్శలు చేస్తుందని చెప్పారు. ఇప్పటికే యూపీలో ఆరు దశల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. నేటితో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. చివరి దశ పోలింగ్ సోమవారం జరగనుంది. కాగా, వీటి ఫలితాలు వచ్చే నెల 10న వెలువడనున్నాయి.


Next Story

Most Viewed