తాలిబన్లపై యూఎన్ ఆగ్రహం.. అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారంటూ..

by Dishafeatures2 |
తాలిబన్లపై యూఎన్ ఆగ్రహం.. అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైనప్పటి నుండి అక్కడి బాలికలపై తీవ్ర నిబంధనలు పెడుతున్నారు. వారు ఏ రంగంలో రాణించకుండా అడ్డుకుంటున్నారు. ఆఖరికి వారి చదువుపై కూడా నిబంధనలు పెట్టారు. 6వ తరగతి వరకు మాత్రమే బాలికలు చదవాలని తెలిపారు. అంతేకాకుండా అంతకన్నా పైచదువులు చదివే ఆడపిల్లలను స్కూల్‌కు రాకుండా వారిపై బ్యాన్ విధంచారు. అయితే తాజాగా ఈ బ్యాన్ వ్యవధి పూర్తయింది. దాంతో బుధవారం ఆడపిల్లలు స్కూళ్లకు బయలుదెరారు.

కానీ ఆరవ తరగతి కన్నా పెద్ద తరగతి పిల్లలను స్కూల్లో రాకుండా అడ్డుకున్నారు. వారిపై బ్యాన్‌ను పొడిగిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. దీనిపై ఆప్ఘనిస్తాన్‌లోని యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ (యుఎన్ఏఎమ్ఏ) స్పందించింది. బాలికల చదువు విషయంలో తాలిబన్ల నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. 6వ తరగతి పై తరగతుల బాలికలను పాఠశాలలకు రాకుండా నిరోధించడం దారుణమని పేర్కొంది. ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆడవారికి అన్యాయం జరుగుతోంది. వారిని అన్ని రంగాల్లో అణచివేస్తున్నారని యూఎన్ పేర్కొంది.



Next Story