'సంగీతంతో సైలెన్స్‌ను భ‌గ్నం చేయండి': గ్రామీ వేదిక‌పై ఉక్రెయిన్ ప్రెసిడెంట్

by Disha Web Desk 20 |
సంగీతంతో సైలెన్స్‌ను భ‌గ్నం చేయండి: గ్రామీ వేదిక‌పై ఉక్రెయిన్ ప్రెసిడెంట్
X

దిశ‌, వెబ్‌డెస్క్ః వారాలు గ‌డుస్తున్నాయ్‌.. యుద్ధం తెల్లార‌ట్లేదు! మ‌రోవైపు, అమెరికాను, యూర‌ప్‌ను న‌మ్ముకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మోస‌పోయాన‌ని తెలుసుకున్నాడు. నిజం తెలిసిన‌ప్ప‌టికీ గుండె ధైర్యాన్ని మాత్రం వ‌ద‌ల‌కుండా, త‌న దేశ సార్వ‌భౌమ‌త్వం కోసం పోరాడుతున్నాడు. అలాగే, త‌మ దేశానికి జ‌రుగుతున్న అవ‌మానం, అన్యాయం గురించి అంత‌ర్జాతీయ స‌మాజానికి పంపే విన‌తుల్ని కొన‌సాగిస్తునే ఉన్నాడు. ఇందులో భాగంగానే, తాజాగా గ్రామీ అవార్డ్స్‌-2022 వేదిక‌పై జెలెన్స్కీ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. త‌న‌ వీడియో సందేశంలో ఉక్రెయిపై ర‌ష్యా దండయాత్ర కథను చెప్పడంలో సంగీత ప్ర‌పంచం మద్దతు ఇవ్వాల‌ని కోరారు.

యుద్ధపు ఘోష‌ను ఘోరమైన నిశ్శబ్దంతో పోల్చిన జెలెన్స్కీ పిల్లలతో సహా ఉక్రేనియన్ ప్రజల కలలు, జీవితాల్లో ఈ మౌనం మ‌రింత భ‌యంక‌రంగా ఉందని చెప్పారు. "మా సంగీతకారులు టక్సేడోలకు బదులుగా శ‌రీరానికి యుద్ధ‌ కవచాన్ని ధరిస్తున్నారు. ఆసుపత్రుల్లో గాయాలతో పాట‌లు వినిపిస్తున్నారు. వినలేని వారి కోసం కూడా వాళ్లు పాడుతూనే ఉన్నారు"అని జెలెన్స్కీ అన్నాడు. "ఏది ఏమైనప్పటికీ సంగీతాన్ని ఆప‌డం ఎవ‌రివ‌ల్లా కాదు". అందుకే మీరు "నిశ్శబ్ధాన్ని మీ సంగీతంతో నింపండి. మా కథను చెప్పడానికి ఈరోజే దాన్ని పూరించండి. మీ సోషల్ నెట్‌వర్క్‌లలో, టీవీల్లో యుద్ధం గురించి నిజం చెప్పండి. మీరు చేయగలిగిన ఈ మార్గంలో మీరు మాకు మద్దతు ఇవ్వండి. మౌనంగా మాత్రం ఉండకండి. త‌ర్వాత‌ మన అన్ని నగరాలకు శాంతి వస్తుంది, " అని జెలెన్స్కీ అంత‌ర్జాతీయ సంగీత స‌మాజాన్ని ఉద్దేశించి మాట్లాడాడు.


Next Story

Most Viewed