పోరాట స్ఫూర్తి.. జబ్బకు తుపాకీ, చేతిలో బిడ్డతో వండర్ ఉమన్

by Disha Web Desk 12 |
పోరాట స్ఫూర్తి.. జబ్బకు తుపాకీ, చేతిలో బిడ్డతో వండర్ ఉమన్
X

దిశ, ఫీచర్స్ : రష్యాతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఒక ఉక్రెయిన్ మహిళ.. భుజానికి తుపాకీ తగిలించుకుని, బిడ్డతో వీధిలో నడుస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పిక్‌ను 'ఉక్రెయిన్స్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్స్ సెక్యూరిటీ' ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఆమె పోరాట స్ఫూర్తి ఉక్రెయిన్ వాసుల్లో గుండె ధైర్యాన్ని నింపుతుండగా.. తనను 'వండర్ ఉమన్' గా పిలుస్తున్నారు. ఇక ఈ ఫొటోకు సైతం 'ప్రతీ ఉక్రెయిన్ తల్లి ఒక వండర్ ఉమన్‌‌తో‌ సమానం' అనే కొటేషన్ యాడ్ చేయడం విశేషం.

ప్రస్తుతం ఉక్రెయిన్ వ్యాప్తంగా అనేక హృదయవిదారక సంఘటనలు తారసపడుతున్నాయి. అంతకుముందు ఓ శిశువు తన తల్లిదండ్రులకు సంబంధించిన ఉక్రెయిన్ సైనిక యూనిఫామ్‌లో ప్రశాంతంగా నిద్రిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా ఆ ఫొటోకు 'గుడ్‌బై మై లిటిల్‌ బాయ్‌.. నేను బతికుంటే నిన్ను మరోసారి చూస్తానని ఆశిస్తున్నా' అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా అక్కడి కైవ్, చెర్నివ్, సుమీ, ఖార్కి వ్, మారియుపోల్ నగరాల్లో హ్యుమన్ టేరియన్ కారిడార్స్ కల్పించేందుకు గాను మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది.


Next Story

Most Viewed