ఆ చిన్నారులకు అదే చివరి స్నానం..

by Disha Web Desk |
ఆ చిన్నారులకు అదే చివరి స్నానం..
X

దిశ, కేసముద్రం: స్నానానికి వెళ్లిన చిన్నారులకు అదే చివరి స్నానం అయింది. రోజు అదే ప్రాంతంలో జలకాలాట ఆడుతున్నా.. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి ఇద్దరు చిన్నారులు జలసమాధి అయ్యారు. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలంలో జరిగిందీ విషాద ఘటన.

తౌర్యతండా గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బ తండాకు చెందిన నలుగురు బాలికలు ధరావత్ రమ్యశ్రీ (8) , జాటోతు వాసంతి (10) , ధరావత్ ఇందు (8), వాంకుడోత్ వైష్ణవి రోజు మాదిరిగానే సోమవారం కూడా తండా శివారులోని ఎస్ఆర్ఎస్‌పీ కాల్వలో స్నానం చేయడానికి వెళ్లారు. నీళ్ల లోతు తక్కువగా ఉండటంలో నలుగురూ కలిసి ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. వెంటనే గమనించిన చిన్నారులు పైకి ఎక్కేందుకే మోటారుకు కట్టిన తాడును పట్టుకోగా అది కాస్తా తెగి నలుగురు బాలికలు కాల్వలో పడిపోయారు.

బాలికల అరుపులు విని సమీపంలో ఉన్న బాలుడు వంకుడొత్ చరణ్ తేజ్, వంకుడొత్ భారత్ నీళ్లలో దూకి ఇద్దరిని కాపాడారు. అప్పటికే నీటి ప్రవాహం పెరిగడంతో ధరావత్ రమ్యశ్రీ, జాటోత్ వాసంతి మృతి చెందారు. ఈ ఘటనతో దుబ్బతండాలో విషాధచాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, బంధువుల రోధనలతో తండా శోకసంద్రంగా మారింది.



Next Story

Most Viewed