'రంగుల'మయంగా 'హిజ్రా'ల జీవితం

by Dishanational2 |
రంగులమయంగా హిజ్రాల జీవితం
X

దిశ, ఫీచర్స్ : ముంబై మహా నగరంలోని ఓ పెద్ద ఫ్లై ఓవర్‌ పిల్లర్స్ మొత్తం ప్రస్తుతం రంగురంగుల చిత్రాలతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ట్రాన్స్‌జెండర్లపై సమాజ వైఖరిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అంతలా ఈ పెయింటింగ్స్‌‌లో ఏం ఉంది? వాళ్ల జీవితాలను మార్చే శక్తి నిజంగా ఈ చిత్రాలకు ఉందా? తెలుసుకుందాం..





గతంలో సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్లను మూడో జెండర్‌గా పేర్కొంటూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. విద్య, ఆరోగ్యం, ఉద్యోగాల్లో వారికి మైనారిటీ హక్కులు వర్తిస్తాయన్న చారిత్రాత్మక తీర్పు తర్వాత సమాజంలో కొంత మార్పు మొదలైంది. కానీ చాలా కార్యాలయాల్లో వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదు. దీంతో ట్రాన్స్‌జెండర్స్ కొందరు ట్రాఫిక్ సిగ్నల్స్, రైళ్లలో భిక్షాటన చేస్తుండగా.. మరికొందరు వ్యభిచార వృత్తిలో బతుకీడుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిజ్రాలకు సమాజంలో సముచిత గౌరవం దక్కేందుకు 'అరవని ఆర్ట్ ప్రాజెక్ట్' సభ్యులు కృషిచేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు, వ్యాపారులు, ఎన్‌జీవో సంస్థలతో కలిసి పనిచేస్తున్న అరవని.. అనేక భారతీయ నగరాల్లో స్ట్రీట్ ఆర్ట్ ప్రాజెక్ట్స్ కోసం ట్రాన్స్‌జెండర్స్‌ను ఒక్కచోటకు చేర్చింది. ఈ క్రమంలోనే కొంతమంది ట్రాన్స్‌జెండర్స్‌కు ముంబైలోని ఫ్లై ఓవర్‌కు మ్యూరల్స్ వేసే అవకాశాన్ని కల్పించింది.





'మా టాలెంట్ చూపించేందుకు ఇదొక అవకాశం. మేము భిక్షాటన కోసం ఇల్లిల్లు, వాడవాడ తిరుగుతాం. అయినా కష్టపడి సంపాదించేందుకే ఇష్టపడతాం. ప్రస్తుతం మా పనితనాన్నిచూసి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపై వాళ్లు మమ్మల్ని చూసే దృష్టి మారుతుంది. చూడగానే సానుకూలంగా ఆలోచిస్తారు'.

- దీపా కచారే, ట్రాన్స్‌జెండర్, ఉమెన్ ఆర్టిస్ట్

మేం వేధింపులకు గురయ్యాం. మాకు ఎవరూ ఉద్యోగాలు ఇవ్వనందునే కడుపు నింపుకునేందుకు భిక్షాటన చేస్తున్నాం. కానీ ఇప్పుడు అది కూడా పక్కనపెట్టేశాం. ఇప్పుడు ఆర్టిస్టులం. మీరు సహకరిస్తే ఇంకా ఎన్నో చేయగలం'.

- అయేషా కోలి, ట్రాన్స్‌జెండర్ ఆర్టిస్ట్



Next Story