జోరుగా మట్టి దందా.. అధికారులు కాసులు కురిపిస్తున్న ఆ వ్యాపారం

by Disha Web Desk 12 |
జోరుగా మట్టి దందా.. అధికారులు కాసులు కురిపిస్తున్న ఆ వ్యాపారం
X

దిశ, కోదాడ: కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా.. మట్టి మాఫియా రెచ్చిపోతోంది. విలువైన గుట్టలు మాఫియా చేతిలో కరిగిపోతున్నాయి. గ్రామంలోని ప్రభుత్వ భూములలో అక్రమంగా మట్టి దందా జోరుగా కొనసాగుతున్న అధికారులు మాత్రం తమకేమీ పట్టింపు లేనట్టు చోద్యం చూస్తూ వ్యవహరిస్తున్నారని ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు . అధికారులు తగు చర్యలు తీసుకొని అక్రమ మట్టి తవ్వకాలు నిలువరించాలని స్థానికులు కోరుతున్నారు. కోదాడ నియోజకవర్గంలోని కోదాడ రూరల్ పరిధిలోని ద్వారకుంట కొమరబండ, అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ వెంకటరామపురం చిలుకూరు మండలంలోని సీతారాంపురం, గ్రామాలలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు గుట్టలు సైతం వదలకుండా గత కొన్ని నెలలుగా అక్రమంగా మట్టి దందా యధేశ్చగా కొనసాగుతుంది.

అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది . ప్రభుత్వ స్థలాల నుంచి అక్రమంగా తవ్విన మట్టిని టిప్పర్ల సహాయంతో తరలిస్తూ అక్రమార్కులు లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. ట్రిప్పర్ మట్టిని సుమారు రూ. 4000 నుంచి 5000 లు తీసుకుని ఇటుక బట్టీల నిర్వాహకులకు అమ్ముకుంటున్నారు. అంతే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రాత్రి, పగలు మట్టి మాఫియా జోరుగా కొనసాగడంతో గ్రామ నుంచి హైవే కు వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు పూర్తిగా గుంతల మయం కావడంతో ప్రమాదకరంగా మారింది. ఇట్టి విషయంలో స్థానికులు అధికారులకు తెలిపిన పట్టించుకోకపోవడంతో అధికారుల అండదండలతో మట్టి మాఫియా కొనసాగుతుందని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి లక్షల రూపాయలు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడ వెంచర్ పెడితే అక్కడ వీరు ప్రత్యక్షమై మైనింగ్ మాఫియాని కొనసాగిస్తున్నారు. ట్రాక్టర్ మట్టిని 1000 నుండి 1200 వరకు అమ్ముతున్నారు.

ఇంతలా జరుగుతున్నా అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా అధికారుల తీరు ఉందని సామాజిక కార్యకర్తలు ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది మెగా ప్రకృతి వనం పేరుతో చిలుకూరు ప్రభుత్వ గుట్టలను కొల్లగొట్టి వ్యాపారం సాగిస్తున్నారు. అసలు ఆ గుట్టను చదును చేసి మెగా ప్రకృతి వనం లో చదును చేసి ఉంచాలి. కానీ కొంత మంది అక్రమార్కులు వెంచర్లకు అమ్ముకోవటం మొదలుపెట్టారు. ఆ నోటా ఈ నోటా పడి ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి ధర్నా నిర్వహించి మట్టిని ఆపాలని తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.

నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు

గుట్టలు, ప్రభుత్వ భూములలో మట్టి తవ్వకాలకు అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. మైనింగ్ శాఖకు పన్ను చెల్లించి అనుమతి తీసుకోవాలని, క్యూబిక్ మీటర్ చొప్పున ధర చెల్లించాకే మట్టి తవ్వకాలు జరపాలి, కానీ నిబంధనలేవి అమలు కావడం లేదు. అక్రమార్కులు ఇష్టానుసారంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు గుట్టలను, ప్రభుత్వ భూములను తవ్వేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు తమ పంట పొలాల్లో తవ్విన మట్టిని ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి తరలించాలంటే ఖచ్చితంగా మైనింగ్ అధికారులు అనుమతులు అవసరం. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న అధికారులు మట్టి మాఫీయాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని స్థానికులు నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మట్టి మాఫియా ఆగడాల పై ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా

చిలుకూరు మండలంలోని సీతారాంపురం గుట్టలో పల్లె ప్రకృతి వనం పేరుతో మట్టి దందా కొనసాగిస్తున్న క్రమంలో ఎంపీపీ బండ్ల ప్రశాంతి ధర్నా నిర్వహించారు. పల్లె ప్రకృతి వనం పేరుతో మట్టి దందాకు కొనసాగించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మండలంలోని కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.

భౌతిక దాడులు కైనా సిద్ధమైన మట్టి మాఫియా

కొంతమంది మట్టి మాఫియా దారులు తమకు అడ్డు వస్తే భౌతిక దాడుల చేయడానికైన సిద్ధమయ్యారు. ఇటీవల కొందరు వ్యక్తులు మట్టి తోలడం ఏమిటని రోడ్లు పాడాయి పోతున్నాయని, గుంతలు కొట్టుకొని పోతున్నాయని మొరపెట్టుకున్నా వారిపై దాడికి దిగినట్లు సమాచారం.

సిండికేట్‌గా ఏర్పడి దందా కొనసాగింపు

మట్టి దందాను యథేచ్ఛగా కొనసాగించేందుకు ఒక ప్రజాప్రతినిధి‌తో మాట్లాడి ఐదుగురు వ్యక్తులు సిండికేట్‌గా ఏర్పడి గత సంవత్సర కాలంగా ఈ మట్టి దందా కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. ఇటీవల ఒక వ్యక్తిని మట్టి మాఫియా నుంచి తొలగించినట్లు సమాచారం.

ఎవరికీ అనుమతి ఇవ్వలేదు: తహశీల్దార్ శ్రీనివాస్ శర్మ


మట్టి తోడెందుకు ఎవరికీ ఎటువంటి అనుమతి ఇవ్వలేదని తహశీల్దార్ శ్రీనివాస్ శర్మ అన్నారు. ఖమ్మం కోదాడ జాతీయ రహదారి వాళ్ళు పర్మిషన్ కోసం వచ్చారు. మైనింగ్ పర్మిషన్ తీసుకుని చెప్పామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా మట్టి తోలితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story

Most Viewed