మెదక్ ప్రభుత్వ డైట్ కళాశాలలో అధ్యాపకుల కొరత

by Dishanational2 |
మెదక్ ప్రభుత్వ డైట్ కళాశాలలో అధ్యాపకుల కొరత
X

దిశ, మెదక్ : మెదక్ ఉమ్మడి జిల్లా‌‌లో ఉన్న ప్రభుత్వ ఏ కైక ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ( డైట్) మెదక్ కళాశాలలో అధ్యాపకుల కొరత‌తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 270 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. మెదక్ డైట్ శిక్షణా సంస్థలో శిక్షణ పొంది ఉపాధ్యాయులుగా రాణించి మంచి భవిష్యత్తు కలలు కంటున్న విద్యార్థుల కలగానే మిగిలిపోయేలా ఉంది. పాలకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. 30 మంది అధ్యాపకులు బోధించాల్సిన సబ్జెక్టులు కేవలం ఇద్దరు మాత్రమే బోధిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు బోధన ఎలా సాగుతుందో.

విద్యార్థులు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ హేమలత తో పాటు కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ జిల్లా విద్యా శాఖ అధికారి రమేష్ కు విద్యార్థులు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదు. కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు డిప్యూటేషన్ గతంలో వచ్చారు. కనీసం 12 మంది ఉపాధ్యాయులు పై ఇస్తేనే ఇక్కడ విద్యాబోధన సరిగా జరగుతుందని విద్యార్థులు చెబుతున్నారు. తెలుగు ఇంగ్లీష్ ,ఉర్దూ , మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులు కలిపి అదనంగా పూర్వ ప్రాథమిక విద్య ( డిప్లమాఇన్ ఫ్రీఎడ్యుకేషన్ కోర్సు) మెదక్ డైట్ కళాశాలలో ప్రభుత్వం ప్రారంభించింది. కానీ ప్రభుత్వం అధ్యాపకులను నియమించ లేదు. ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. కనీసం జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లీష్ మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించి ఇద్దరు ఉపాధ్యాయుల ఉన్న ప్రభుత్వ పాఠశాలల నుంచి ఇక్కడికి డిప్యూటేషన్ వేయవచ్చు. అయినప్పటికీ జిల్లా విద్యా శాఖ అధికారి రమేష్ పట్టించు కోవడం లేదని విద్యార్థులు మండి పడుతున్నారు.

ఇప్పటికైనా కలెక్టర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. విద్యార్థులు ఎన్నోసార్లు డి ఈ ఓ, కలెక్టర్, ఎమ్మెల్యేను, కలిగినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో మెదక్ డైట్ డైట్ కళాశాలలో 30 కి 30 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. ప్రస్తుతం నియామకాలు లేక విద్యా బోధన పూర్తిగా నిర్వీర్యమై పోయింది. 30 పోస్టులు మంజూరు ఉన్నప్పటికీ కేవలం ప్రిన్సిపల్ తో కలసి ఇద్దరు మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయడం లేదు. తెలుగు, సైన్స్ ,మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్, ఫిలాసఫీ, ఉర్దూ మీడియంలో లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈ డైట్ కళాశాలకు ప్రిన్సిపల్,7 గురు సీనియర్ లెక్చరర్లు 17 మంది తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ బోధించేందుకు ఐదుగురు ఉర్దూ మీడియం అధ్యాపకులు,( డీ పీ ఎస్ ఇ,) డిప్లమా ఇన్ ఫ్రీ ఎడ్యుకేషన్.. కోర్సుకు సంబంధించి, ప్రత్యేకంగా ఈ కోర్సును మెదక్ డైట్ కళాశాలకు మంజూరు చేశారు. ఇందులో ఏడుగురు అధ్యాపకులు ఉండాల్సి ఉండగా ఒక్కరు కూడా లేరు. బావి భారత విద్యార్థులను ఉపాధ్యాయులుగా తీర్చి దిద్దాలిసిన విద్యార్థుల‌కే ఇలాంటి పరిస్థితులు ఉంటే కనీసం తాము పాస్ అవుతామో లేదోనని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు పట్టించుకోని మెదక్ డైట్ కళాశాలలో అధ్యాపకులను నియమించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే తాము ఆందోళన‌లు చేపట్టే పరిస్థితి వస్తుందని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.


Next Story