RTC డ్రైవర్‌‌పై టీచర్ దాడి.. రోజు అలా చేస్తున్నాడంటూ ఫిర్యాదు

by Dishanational2 |
RTC డ్రైవర్‌‌పై టీచర్ దాడి.. రోజు అలా చేస్తున్నాడంటూ ఫిర్యాదు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఆర్టీసీ డ్రైవర్ పై ఉపాధ్యాయురాలు దాడి చేసిన ఘటన సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం‌లో చోటు చేసుకుంది. దీనితో డ్రైవర్, ఉపాధ్యాయురాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్లితే.. గద్వాల జిల్లా కేంద్రం నుండి టీఎస్ 06 యూఎ 8388 నెంబర్ గల ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం కర్నూల్‌కి బయలుదేరుతుండగా, ఎర్రవల్లి చౌరస్తా వద్ద మిగతా ప్రయాణికులతో పాటు కోదండ పూర్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు రాణమ్మ సైతం బస్సు ఎక్కింది. ఈ క్రమంలో బస్సు గేర్ బాక్స్ నుండి అనుకోకుండా పొగలు రావడంతో.. డ్రైవర్ కావాలనే పొగలు వచ్చేలా చేస్తున్నాడని భావించిన ఉపాధ్యాయురాలు డ్రైవర్ గోపాల్‌‌తో వాదనకి దిగింది. దీంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో రాణమ్మ తన చేతిలో ఉన్న గొడుగుతో డ్రైవర్ పై దాడికి పాల్పడినట్లు మిగతా ప్రయాణికులు వెల్లడించారు. గొడవ పెద్దది కావడంతో ఇరువురు ఎర్రవల్లి పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తను రెగ్యులర్‌గా ఇదే బస్సు లో విధులకు వెళ్లే క్రమంలో డ్రైవర్ కావాలని తాను బస్సు ఎక్కే సమయంలో బస్సును ముందుకు తోలడం, ఆపవలసిన చోట ఆపకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఇదే విషయంలోనూ ఈరోజు డ్రైవర్‌ను అడగగా అసభ్యకరంగా మాట్లాడని ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అకారణంగా దాడికి పాల్పడిన ఉపాధ్యాయురాలుపై చర్య తీసుకోవాలని డ్రైవర్ గోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువురి ఫిర్యాదులను తీసుకున్న పోలీసులు కేసు నమోదు కోసమై వివరాలను సేకరిస్తున్నారు.



Next Story

Most Viewed