డ్రీమ్ ప్రాజెక్ట్ బిగ్ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.. ప్రపంచంలోనే బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటూ ప్రకటన

by Anjali |   ( Updated:2024-05-05 12:59:45.0  )
డ్రీమ్ ప్రాజెక్ట్ బిగ్ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.. ప్రపంచంలోనే  బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటూ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. జక్కన్న దర్శకత్వంలో ఏ సినిమా తెరకెక్కిన పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. భారీ వసూళ్లు కొల్లగొట్టాల్సిందే. దీనికి నిదర్శనం మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్‌ గురించి అందరికీ తెలిసిందే. మహాభారతం తన లాస్ట్ మూవీ అని అనేక సందర్భాల్లో చెప్పారు. తాజాగా ఈ చిత్రం గురించి మరో అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. ‘‘మహాభారతాన్ని నా మైండ్‌లో ఉన్నది ఉన్నట్లు తీస్తే ప్రపంచంలోనే పెద్ద హిట్ అవుద్ధి.. మొత్తం 10 భాగాలుగా ఉంటది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ ప్రారంభిస్తామని రాజమౌళి సోషల్ మీడియా వేదికన ప్రకటించారు. కాగా, ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఇప్పుడిప్పుడు స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి షూటింగ్‌కు పట్టాలెక్కించే పనిలో ఉన్నారు.

Read More..

సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ లగ్గం రెడీ..మన ఇంట్లో పెళ్లిలా ఉటుందంటూ కామెంట్స్!

Advertisement

Next Story