నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి

by Sridhar Babu |
నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : తన భూమిలోకి అక్రమంగా చొరబడి కూల్చివేయటమే కాకుండా తనపై దాడి యత్నం చేసి తన భద్రతను ప్రశ్నార్థకం చేసిన సంఘటనపై విశ్వసనీయ సంస్థతో దర్యాప్తు చేయాల్సిందిగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సుచిత్ర కూడలిలో సర్వేనెంబర్ 82, 83 లో జరిగిన భూ వివాద ఘర్షణ పై ఆయన మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే కు చెందిన భూమిని దౌర్జన్యంగా కబ్జా చేసే ప్రయత్నం చేయడమే కాకుండా ఏకంగా తనపై

దాడి యత్నంకు జరిగిన పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓ పక్క ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగానే వందల సంఖ్యలో దుండగులు అక్రమంగా తన భూమిలో ప్రవేశించి విధ్వంసం చేయడం శోషనీయమని తెలిపారు. నిత్యం 24 గంటలు లా అండ్ ఆర్డర్ పర్యవేక్షిస్తున్న ఉన్నత పోలీసు అధికారులకు ఇతరత్రా యంత్రాంగానికి తన భూమిలో జరిగిన విధ్వంసం గుర్తించలేదని అన్నారు. జరిగిన సంఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Next Story

Most Viewed