అప్పుడే ‘ప్రేమలు 2’ షూటింగ్ మొదలు పెట్టేసారుగా..మరీ ఇంత ఫాస్ట్‌గా వున్నరేంట్రా బాబు

by Dishafeatures1 |
అప్పుడే ‘ప్రేమలు 2’ షూటింగ్ మొదలు పెట్టేసారుగా..మరీ ఇంత  ఫాస్ట్‌గా వున్నరేంట్రా బాబు
X

దిశ,సినిమా: ఇటీవల విడుదలైన మలయాళ మూవీ ‘ప్రేమలు’ ఊహించని విధంగా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో నస్లీన్, మమిత బైజు జంటగా నటించారు. దీనిని గిరీష్ ఏడి కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి్ంచగా..మార్చి 8న థియేటర్స్‌లో విడుదలైంది.

ఈ చిత్రాన్ని దర్శకధీరుడు తనయుడు కార్తికేయ రూపొందించాడు. హైదరాబాద్ బ్రాక్‌‌డ్రాప్‌లో వచ్చిన ప్రేమలు దాదాపు వందకోట్లకు పైగా రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ ని తీసుకు రావాలని భావించి ఇటీవలే ఈ మూవీ సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేశారు అనే విషయం తెలిసిందే.

అయితే అలా అనౌన్స్ చేసారో లేదో వెంటనే షూటింగ్ ని కూడా మొదలు పెట్టేసి.. ప్రేమలు 2 షూటింగ్ మొదలైందని తెలియజేస్తూ హీరోయిన్ మమిత బైజు తాజాగా ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ..ఇంత ఫాస్ట్ గా వున్నరేంట్రా బాబు ..మీ స్పీడ్ చూస్తుంటే ఈ సంవత్సరమే సీక్వెల్ దించేలా ఉన్నారుగా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story