ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు.. మహిళలను నేలపై కూర్చోబెట్టిన సిబ్బంది

by Disha Web |
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు.. మహిళలను నేలపై కూర్చోబెట్టిన సిబ్బంది
X

దిశ, శంకర్ పల్లి: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కోసం వచ్చిన మహిళలను వైద్య సిబ్బంది నేలపైనే కూర్చోబెట్టి వివరాలు సేకరిస్తున్నారు. శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సోమవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం 78 మంది మహిళలు వచ్చారు. మహిళలు కూర్చునేందుకు కనీసం ఆసుపత్రి ఆవరణలో స్థలం లేక ఇరుకైన వరండాలోనే కూర్చోబెట్టి వివరాలు సేకరిస్తున్నారు. మహిళల కష్టాలను తీర్చడంలో స్థానిక ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ఇక ఆపరేషన్‌లు పూర్తయిన తర్వాత మహిళల కష్టాలు చెప్పాల్సిన అవసరం లేదు.

అసంపూర్తిగా పోస్ట్ ఆపరేటివ్ భవనం..

శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ల కోసం వచ్చే మహిళలు విశ్రాంతి తీసుకునేందుకు రూర్బన్ పథకంలో పోస్ట్ ఆపరేటివ్ భవనానికి నిధులు మంజూరు చేసింది. అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ స్వార్థం మూలంగా భవన నిర్మాణం పనులు అసంపూర్తిగా వదిలేశారు. దీంతో మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు.

78 మంది మహిళలకు ఆపరేషన్స్..

శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 78 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందని వైద్యాధికారి సత్య జ్యోతి తెలిపారు. డి పి ఎల్ సర్జన్ హరిశ్చంద్ర రెడ్డి, డాక్టర్ సుమన్ ఆధ్వర్యంలో మనీష్ చంద్ర, శిరీష లు ఆపరేషన్లు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది శ్రీనివాస్, మాధవరావు, నెహ్రూ నాయక్, మన్సూర్, సుదర్శన్ రెడ్డి ,డాక్టర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


Next Story