అధ్యాపకుల మధ్య అలా జరగడంతో రోడ్డెక్కిన విద్యార్థులు..

by Disha Web Desk 13 |
అధ్యాపకుల మధ్య అలా జరగడంతో రోడ్డెక్కిన విద్యార్థులు..
X

దిశ, నర్సంపేట: భావితరానికి విద్యా బుద్ధులు నేర్పాల్సిన బాధ్యత అధ్యాపకులది. అలాంటి అధ్యాపకుల మధ్య నెలకొన్న విభేదాలు బడి పిల్లల్ని రోడ్డెక్కేలా చేశాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పెద్ద కోరుపోలు గ్రామంలో కస్తూర్బా గాంధీ గురుకులం ఉంది. ఇందులో మొత్తం 220 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలో 9 మంది అధ్యాపకులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా గడచిన కొన్ని రోజులుగా స్పెషల్ ఆఫీసర్ సునీతకు మిగతా అధ్యాపకులకు మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి.


ఈ క్రమంలో విద్యార్థులకు అందించాల్సిన సౌకర్యాల్లో నిర్లక్ష్యం పెరిగింది. విద్యార్థులు తమకు పెట్టే భోజనం సరిగ్గా ఉండట్లేదని, సరిపోయేంత లేదని పలుమార్లు అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా అయితే అధ్యాపకుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. సోమవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో విషయం బయటికి పొక్కింది.


స్పెషల్ ఆఫీసర్ సునీతను దిశ విలేకరి వివరణ కోరగా.. ఒకసారి పిల్లలు ఫుడ్ బాలేదని చెప్పారు. వెంటనే వంట వాళ్లకు చెప్పాను. ఇప్పుడే పిల్లలు అంటున్నారు ఫుడ్ బాలేదని టీచర్స్ కి రోజూ చెబుతున్నామని అని అన్నారు. నా దృష్టికి ఎవరూ తీసుకురాలేదు. మరోసారి జరగకుండా చూస్తాను అని అన్నారు.




Next Story

Most Viewed