నిద్రలో మెదడును 100సార్లు మేల్కొలిపే హర్మోన్!

by Dishanational1 |
నిద్రలో మెదడును 100సార్లు మేల్కొలిపే హర్మోన్!
X

దిశ, ఫీచర్స్ : నిద్రలో మెదడుకు సంబంధించిన మిస్టీరియస్ మెకానిజాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు రాత్రంతా దాని కెమిస్ట్రీ ఎలా మారుతుందని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు నిద్రాసమయంలో 'నోరాడ్రినలిన్' అని పిలిచే స్ట్రెస్ హార్మోన్ విపరీతమైన హెచ్చుతగ్గులకు గురవుతుందని, మనకు తెలియకుండానే మెదడును మేల్కొల్పడం సహా జ్ఞాపకాలను నిలుపుకునే విధానానికి సహకరిస్తుందని పరిశోధకులు గుర్తించారు.

నిద్రా సమయంలో మెదడు పనితీరును పరిశీలించేందుకు కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం ఎలుకలపై ప్రయోగాల చేసింది. ఈ మేరకు ఎల్‌ఈడీ‌లకు అనుసంధానించిన ఆప్టికల్ ఫైబర్స్ సహా జన్యుపరంగా-ఇంజనీరింగ్ చేసిన కాంతి గ్రాహకాలను ఎలుకల మెదడుల్లోకి పంపించారు. ఇవి ఎలుకలు నిద్రిస్తున్నప్పుడు నోరాడ్రినలిన్ స్థాయిలను ట్రాక్ చేసే వీలు కల్పించగా.. స్ట్రెస్, అడ్రినలిన్, దృష్టి కేంద్రీకరించే సామర్థ్యంతో సంబంధం కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

నిద్రలో నోరాడ్రినలిన్ క్రియారహితంగా ఉంటుందని మునుపటి అధ్యయనాలు సూచించగా.. నిద్రపోతున్న ఎలుకల్లో దాని స్థాయిలను పర్యవేక్షించడం ద్వారా శాస్త్రవేత్తలు అది సత్యదూరమని నిరూపించారు. ఈ అధ్యయన పరిశీలనలు మానవులకు కూడా అన్ని సంభావ్యతలో అనుకూలంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. తదుపరి ప్రయోగాల్లో, శాస్త్రవేత్తలు నోరాడ్రినలిన్ తరంగాల వ్యాప్తిని మార్చేందుకు ఇంప్లాంట్స్ ఉపయోగించారు. తద్వారా అత్యధిక సంఖ్యలో లోతైన నోరాడ్రినలిన్ కలిగి ఉన్న ఎలుకలు మెమరీ పరీక్షలలో ఉత్తమంగా పనిచేశాయని చూపించగలిగారు. ఎలుకలు వస్తువులను పసిగట్టడం, నిద్రపోవడం, ఆపై అవి గుర్తుకు తెచ్చుకున్న వాటిని చూసేందుకు తిరిగి రావడం వంటివి ఈ అధ్యయనంలో పరిశీలించారు.

నిద్ర అనేది ఉండే స్థిరమైన స్థితి అని మీరు అనుకోవచ్చు. కానీ నిద్రపోయాక కంటికి కనిపించే దానికంటే చాలా ఎక్కువ విషయాలే మీ మెదడులో జరుగుతాయి. నోరాడ్రినలిన్ మిమ్మల్ని రాత్రికి 100 కంటే ఎక్కువ సార్లు మేల్కొనేలా చేస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు నోరాడ్రినలిన్ సాంద్రతలు పెరగడం, తగ్గడం స్పష్టంగా గమనించాం. ఈ స్థాయిలు, మేల్కొలుపు స్థాయి మధ్య స్పష్టమైన సంబంధాన్ని గుర్తించాం. ఇది రాత్రంతా నిరంతరం మారుతూ ఉంటుంది. తక్కువ స్థాయిలు నిద్రిస్తున్న స్థితికి అనుగుణంగా ఉంటాయి. అయితే స్థాయిలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, మెదడు కొద్దిసేపు మేల్కొంటుంది. దీంతో న్యూరోలాజికల్‌గా మీరు మేల్కొంటారు. ఎందుకంటే ఈ క్షణాల్లో మీ మెదడు కార్యకలాపాలు మీరు మేల్కొని ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉంటాయి కానీ నిద్రపోయే వ్యక్తి దీన్ని గమనించలేడు.

- సెలియా కెర్బీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయం

మొత్తానికి నిద్రా సారాంశాన్ని మేము కనుగొన్నాము. ఇది మనల్ని విశ్రాంతిగా మేల్కొలపడానికి, ముందు రోజు మనం నేర్చుకున్న వాటిని గుర్తుంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. నిద్రలో రిఫ్రెష్ భాగం నోరాడ్రినలిన్ తరంగాల ద్వారా నడపబడుతుంది. నొర్‌పైన్‌ఫ్రైన్ తరంగాల ద్వారా చాలా తక్కువ మేల్కొలుపులు సృష్టించబడతాయి. ఇవి జ్ఞాపకశక్తికి కూడా చాలా ముఖ్యమైనవి. చిన్న మేల్కొలుపులు మెదడును రీసెట్ చేస్తాయి. తద్వారా మీరు తిరిగి నిద్రలోకి ప్రవేశించినప్పుడు జ్ఞాపకశక్తిని నిల్వ చేయడానికి సిద్ధంగా ఉంటుంది.

- మైకెన్ నెదర్‌గార్డ్, సైంటిస్ట్ బృంద నాయకుడు

Next Story