- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారి కన్ను పడితే మట్టి మాయమే..
పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో మట్టి మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చెరువులు, కుంటలను వదిలే పరిస్థితి లేదు.

దిశ, మణుగూరు : పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో మట్టి మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చెరువులు, కుంటలను వదిలే పరిస్థితి లేదు. అతని కన్ను పడితే ఎంత పెద్ద చెరువులో మట్టి అయినా మాయం కావాల్సిందే. మట్టి తోలకాల్లో వారికి లేరు ఎవరు సరిసాటి. అధికారుల అండదండలతో మట్టి తోలకాల దందాను యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అధికారుల పూర్తి అండదండలు పుష్కలంగా ఉండటంతో వారిని ఆపే వారు వారికి అడ్డు చెప్పే వారు లేరు. దీంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది.
పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి తోలకాలను నిర్వహిస్తున్నారు. ఏ అధికారి కూడా వీరి వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. దీని వలన అధికారులకు ముడుపులు అందజేస్తూ దర్జాగా దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వీరి వ్యాపారం మూడు ట్రక్కులు 100 ట్రిప్పులుగా వర్ధిల్లుతుంది. అర్ధరాత్రిల్లు మట్టి తోలకాలు జరపడం కోసం తిరుగుతున్న ట్రాక్టర్ల మోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా మైనర్ డ్రైవర్లు మితిమీరిన వేగంతో ట్రాక్టర్లు నడపడంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో వణికి పోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ప్రధాన రోడ్ల పై మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేస్తారా తమకేమి పట్టినట్టుగా వ్యవహరిస్తారో వేచి చూద్దాం.






