అప్పుడు నాకెవరూ సాయం చేయలేదు సూసైడ్ చేసుకుందామనుకున్నా

by Disha Web |
అప్పుడు నాకెవరూ సాయం చేయలేదు సూసైడ్ చేసుకుందామనుకున్నా
X

దిశ, సినిమా : ప్రముఖ సింగర్ కల్పన తన జీవితంలో ఎన్నో విషాదకరమైన సంఘటనలు ఎదురైనట్లు చెప్పింది. అయితే కొన్నిసార్లు వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కూతురు కోసమే జీవిస్తున్నట్లు తెలిపింది. తాజాగా ఓ సమావేశంలో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించిన గాయని.. 'పాటలు పాడుతూ 25ఏళ్లు గడిపేశా. ఎన్నో వేధింపుల తర్వాతే మా వివాహబంధం ముగిసింది. ఇండస్ట్రీలో పరువు పోయిందని చాలా మంది చాలా మాటలన్నరు. మా తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.

అప్పుడు ఉద్యోగం లేక పాపను ఎలా పోషించాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఈ విషయంలో ఎవరూ సహాయం చేయలేదు. చీకటిలో ఒంటరి పోరాటం చేశాను. అయితే అన్నీ కోల్పోయిన నాకు సింగర్ చిత్రమ్మ ధైర్యం చెప్పారు. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా? అంటూ నన్ను మార్చేందుకు ప్రయత్నించారు. కొన్ని పోటీల్లో పాల్గొనమని ఎంకరేజ్‌ చేశారు. అప్పటినుంచి ఎంతో కష్టపడి నా కుమార్తె కోసం గెలుస్తూనే ఉన్నా' అంటూ తన మనసులో మాటలను బయటపెట్టింది కల్పన.



Next Story