దేశవ్యాప్తంగా తగ్గిన స్కూల్ డ్రాపౌట్ రేటు

by Disha Web Desk |
దేశవ్యాప్తంగా తగ్గిన స్కూల్ డ్రాపౌట్ రేటు
X

న్యూఢిల్లీ: దేశంలో ప్రైమరీ, సెకండరీ సహా అన్ని స్థాయిల్లో డ్రాపౌట్ అవుతున్న విద్యార్థుల రేటు తగ్గుతూ వస్తోందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం వెల్లడించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని దేశంలో స్కూల్ డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతున్నాయా? అనే ప్రశ్నను శుక్రవారం మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

కేంద్ర విద్యాశాఖ అందించిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో డ్రాపౌట్ రేటు నిరంతరం తగ్గుతోందని మంత్రి పేర్కొన్నారు. భారతదేశంలో స్కూల్ డ్రాపౌట్ సమస్యను అరికట్టడానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ద్వారా రెండు కార్యక్రమాలు చేపట్టామన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనలు అందించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అలాగే వలస కూలీల పిల్లల చదువు కోసం వినూత్న విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ రెండు కార్యక్రమాలను విజయవంతం అమలు చేస్తున్నామని, అందుకే స్కూల్ డ్రాపౌట్ రేటు తగ్గుతూ వస్తోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ధీమా వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed