థాంక్యూ చెబితే.. ఫుడ్ బిల్లులో రూ. 35 తగ్గింపు!

by Disha Web Desk 12 |
థాంక్యూ చెబితే.. ఫుడ్ బిల్లులో రూ. 35 తగ్గింపు!
X

దిశ, ఫీచర్స్: నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారమని, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలనేది పెద్దలు చెప్పే మాట. కానీ పాటించే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. ముఖ్యంగా రెస్టారెంట్స్, కాఫీ షాపుల్లో పనిచేసే వెయిటర్స్‌‌తో అమర్యాదగా ప్రవర్తిస్తూ వారిపై ఊరికే నోరు పారేసుకుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ కస్టమర్లకు 'కర్టసీ డిస్కౌంట్స్' అందిస్తోంది. కాగా ఈ చొరవ పై నెటిజన్లు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. హైదరాబాద్, ఖాజాగూడలోని 'దక్షిణ-5' రెస్టారెంట్ సిబ్బందిని 'ప్లీజ్, థాంక్యూ, హావ్ ఏ గుడ్ డే' వంటి పదాలతో మర్యాదపూర్వకంగా సంబోధిస్తే ఫుడ్ బిల్ నుంచి రూ.35 వరకు తగ్గింపు పొందవచ్చు.

ఉదాహరణకు.. మీరు అక్కడ వెజ్ థాలీ తినాలనుకుని 'థాలీ ప్లీజ్' అని వెయిటర్స్‌‌కు చెప్తే.. రూ. 165ల ఐటమ్‌ను రూ.150కే పొందవచ్చు. ఇక గుడ్ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ వంటి గ్రీటింగ్స్ చెప్పడం వల్ల కూడా బిల్ నుంచి రూ. 30 తగ్గింపు పొందుతారు. దీంతో పాటు 'ఎల్డర్ ది బెటర్' అనే ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా ఎవరైనా డైనర్‌‌ తనతో పాటు వచ్చిన వృద్ధుడి వయస్సుకు సమానమైన ధరను కన్సెషన్‌గా పొందవచ్చు. ఇది కస్టమర్లను మర్యాదగా, హుందాగా నడుచుకోవాలని ప్రోత్సహించడమే కాక వారి ముఖాల్లో చిరునవ్వును కూడా నింపుతుందని రెస్టారెంట్ యాజమాన్యం భావిస్తోంది. అంతేకాదు లాక్‌డౌన్ టైమ్‌లో బెస్ట్ సర్వీస్ అందించిన టాప్ 50 డెలివరీ వర్కర్లను సైతం తమ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సత్కరించడం విశేషం.

రెస్టారెంట్ సిబ్బంది అనేక పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఒక్కోసారి కస్టమర్స్‌కు సంతృప్తికర సేవలు అందించలేరు. ఇది వారిని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే కొంతమంది కస్టమర్స్ కూడా సిబ్బందిపై చిన్నచూపు కలిగి ఉంటారు. ఈ ఇద్దరి మధ్యన 'విన్ విన్' కల్చర్ పెంపొందించేందుకు ఈ ఇనిషియేటివ్ సాయపడుతుంది. ఈ రోజుల్లో మర్యాద అనేది అసాధారణంగా మారింది. ఆ సంస్కృతిని తిరిగి తీసుకొచ్చేందుకే మా ప్రయత్నం.

- దక్షిణ-5 రెస్టారెంట్ యాజమాన్యం


Next Story

Most Viewed