ఆ హీరో చాలామందికి మాజీ ప్రియుడు.. సారా షాకింగ్ కామెంట్స్

by Disha Web |
ఆ హీరో చాలామందికి మాజీ ప్రియుడు.. సారా షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌పై నటి సారా అలిఖాన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా 'కాఫీ విత్ కరణ్' షోలో 'నీ మాజీ ప్రియుడు ఎందుకు ఎక్స్ లవర్ అయ్యాడు?' అని కరణ్ జోహార్ ప్రశ్నించగా.. 'ఎందుకంటే అతడు చాలామందికి మాజీ ప్రియుడు కాబట్టి' అని షాకింగ్ ఆన్సర్ చెప్పింది.

ఇక నెట్టింట వైరల్ అయిన ఈ వ్యాఖ్యలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన కార్తీక్.. 'ఒక రిలేషన్‌లో ఉన్నప్పుడు పార్ట్‌నర్ గురించి బ్యాడ్‌గా చెప్పడం, రూమర్స్ స్ప్రెడ్ చేయడం నాకు నచ్చదు' అంటూ ఇండైరెక్ట్‌గా కౌంటర్ వేయడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు గతంలో వార్తలు ప్రచారం కాగా మరోసారి ఈ లవ్ మ్యాటర్ హాట్ టాపిక్‌గా మారింది.



Next Story