- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థాయిలాండ్‌లో సర్జరీ సక్సెస్.. పూర్తిగా అమ్మాయిగా మారిన మాజీ క్రికెటర్ కుమారుడు
థాయిలాండ్‌లో వాజినోప్లాస్టీ సర్జరీ చేయించుకుని పూర్తిస్థాయి అమ్మాయిగా మారిన భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ (Aryan Bangar) పూర్తిగా అమ్మాయిగా మారిపోయాడు. థాయిలాండ్ లో ఇటీవల జరిగిన తన లింగ మార్పిడి సర్జరీ విజయవంతం కావడంతో ఈ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. గత కొంతకాలంగా 'అనయా బంగర్' (Anaya Bangar)గా తన గుర్తింపును చాటుకుంటున్న తను, తాజాగా థాయిలాండ్‌లో వాజినోప్లాస్టీ (Vaginoplasty) శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సర్జరీతో అతను పూర్తిస్థాయిలో అమ్మాయిగా మారాడు. అంతకుముందే అనయ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) తీసుకున్న విషయం తెలిసిందే. తనలోని అసలు గుర్తింపును పొందడం కోసం పడిన శారీరక, మానసిక సంఘర్షణను తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
తన తండ్రిలాగే క్రికెట్‌పై మక్కువ ఉన్న తను.. స్థానిక క్లబ్ క్రికెట్‌లో రాణించినప్పటికీ, హార్మోన్ థెరపీ వల్ల శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా క్రీడారంగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, తన మనసుకు నచ్చినట్లు జీవించాలనే ధైర్యంతో తను ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయానికి తండ్రి సంజయ్ బంగర్, కుటుంబ సభ్యులు పూర్తి మద్దతు తెలపడం విశేషం. సమాజంలోని కట్టుబాట్లను కాదని, తన అస్తిత్వం కోసం తను చేసిన ఈ ప్రయాణం ఇప్పుడు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.






