ఉక్రెయిన్‌కు నుంచి షాద్ నగర్‌కు చేరుకున్న సాయి శశాంక్

by Web Desk |
ఉక్రెయిన్‌కు నుంచి షాద్ నగర్‌కు చేరుకున్న సాయి శశాంక్
X

దిశ, షాద్ నగర్: రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ అక్కడ చదువుకుంటున్న తమ పిల్లల పరిస్థితి చూసి కన్న తల్లిదండ్రులు తల్లడిల్లి పోయారు. అక్కడ తమ పిల్లలు ఎలా ఉన్నారోనని తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వైద్య విద్యను అభ్యసించడానికి రష్యా, ఉక్రెయిన్‌లకు చాలామంది కన్సల్టెన్సీల ద్వారా వెళ్తుంటారు. ఇలా ఉక్రెయిన్‌లోనే వేలాది మంది తెలుగు విద్యార్థులు వైద్య విద్య అభ్యసిస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో వారంతా బిక్కుబిక్కుమంటున్నారు. స్వదేశానికి రాలేక క్షణక్షణం గండంగా బతుకుతున్నారు. తమను సురక్షితంగా భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

మెడిసిన్‌ విద్య కోసం నాలుగేళ్ళ కిందట ఉక్రెయిన్‌కు వెళ్లిన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన సాయి శశాంక్ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కీవ్‌ నుండి సురక్షితంగా గురువారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది హెల్త్ ఎడ్యుకెటర్ శ్రీనివాస్ కుమారుడు సాయి శశాంక్ శంషాబాద్ విమానాశ్రయంలో తన కుమారుడిని చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కుమారుడిని చూసుకుని ఉద్వేగానికి గురయ్యారు. ఉక్రెయిన్ కీవ్ సిటీలో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న శశాంక్ యుద్ధ నిరీక్షణ తరువాత ఎట్టకేలకు షాద్ నగర్ కు చేరుకోవడంతో ఆనందంగా ఉందని షాశాంక్ తండ్రి శ్రీనివాస్ తెలిపారు. భారత ప్రభుత్వానికి శ్రీనివాస్ కుటంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.



Next Story

Most Viewed