టీఎంసీ పనులను అడ్డుకున్న గ్రామస్తులు.. రిజర్వాయర్ ప్రారంభంతో ఆందోళన

by Web Desk |
టీఎంసీ పనులను అడ్డుకున్న గ్రామస్తులు.. రిజర్వాయర్ ప్రారంభంతో ఆందోళన
X

దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామం మీదుగా నిర్మిస్తున్న అదనపు టీఎంసీ కెనాల్ పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. నిర్వాసితులకు పూర్తి నష్టపరిహారం ఇవ్వకుండా పనులను నిర్వహిస్తే పనులు అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. మొదట గ్రామస్తులకు ఎకరాకి 13 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి పనులు పూర్తిస్థాయిలో చేయడమేంటని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. స్ట్రక్చర్ వ్యాల్యూ చూపకపోవడం, వాటికి తగిన నష్టపరిహారం అందించకపోవడంతో గ్రామస్తులు కెనాల్ పనుల దగ్గరికి వచ్చి రోడ్డుపై బైఠాయించారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ప్రారంభించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. నష్టపరిహారం పూర్తిస్థాయిలో ఇచ్చిన తర్వాత పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులకు సర్ది చెప్పి 10 రోజుల్లో నష్ట పరిహారం అందిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు వెనుదిరిగారు.

Next Story

Most Viewed