ఆ మార్కెట్లో చరిత్ర సృష్టించిన ఎర్ర‌ బంగారం

by Disha Web Desk 12 |
ఆ మార్కెట్లో చరిత్ర సృష్టించిన ఎర్ర‌ బంగారం
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : దేశి మిర్చికి పెరిగిన డిమాండ్‌తో బంగారం కంటే మిన్నగా మారింది. గ‌త కొద్దిరోజులుగా దేశి మిర్చి ధ‌ర పెరుగుతూ పోతూనే ఉంది. తాజాగా వ‌రంగ‌ల్ ఎనుమాముల మార్కెట్లో క్వింటా దేశి మిర్చి ధ‌ర రూ.52వేలు ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌లో రెండవదైన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే మిర్చికి ఇంతటి ధర ఎప్పుడు లభించలేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత నెల‌రోజుల కాలంలోనే క్వింటా దేశి మిర్చి ధ‌ర రూ.16వేల‌కు పైగా పెర‌గ‌డం విశేషం.

అంత‌ర్జాతీయ మార్కెట్లో దేశి మిర్చికి ఏర్ప‌డిన డిమాండ్‌తోనే ధ‌ర పెరుగుతోంద‌ని వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే దేశి మిర్చి సాగు చేసినా అత్యంత త‌క్కువ‌గా దిగుబ‌డి వచ్చిన రైతులు నిరాశ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ధ‌ర అమాంతం పెరుగుతుండ‌టంతో చేతికివ‌చ్చిన పంట‌తో కాస్త‌యినా అప్పుల భారం నుంచి తేరుకుంటామ‌ని మ‌రోవైపు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed