రూ.7 వేలకే రియల్‌మీ కొత్త ఫోన్.. హైఎండ్ బ్యాటరీతో..

by Disha Web |
రూ.7 వేలకే రియల్‌మీ కొత్త ఫోన్.. హైఎండ్ బ్యాటరీతో..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Realme భారత మార్కెట్లోకి కొత్తగా తక్కువ ధరలో హై-ఎండ్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కొత్త ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉండే ధర రూ. 7,499 కి లభిస్తుంది. ఫోన్ ఎక్కువ సేపు వాడే వారి కోసం ఎక్కువ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంది. ప్రతి వినియోగదారునికి ఈ ఫోన్ అనువుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది Unisoc T612 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది.


Realme C30 స్పెషిఫికేషన్లు..

* 6.5-అంగుళాల HD+ (720 x 1600 పిక్సెల్స్) డిస్‌ప్లే.

* 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో.

* ఫోన్ Unisoc T612 1.82GHz చిప్‌సెట్‌ ఆధారితమైనది.

* 3GB RAM 32GB స్టోరేజ్. SD కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 1Tb వరకు విస్తరించవచ్చు.

* వెనుకవైపు 8MP కెమెరా

* ముందు వైపు సెల్ఫీల కోసం 5MP కెమెరా

* కనెక్టివిటీ ఫీచర్‌లలో బ్లూటూత్ 5.0, మైక్రో యుఎస్‌బి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ పోర్ట్.

* 5,000mAh బ్యాటరీ

* 8.5mm సన్నగా, తక్కువ బరువు కలిగి ఉంటుంది.

* జూన్ 27 మధ్యాహ్నం 12.00 గంటల నుంచి ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

Next Story