మహిళలు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు: కలెక్టర్ అమోయ్ కుమార్

by Disha Web Desk 13 |
మహిళలు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు: కలెక్టర్ అమోయ్ కుమార్
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఆడ మగ అనే తేడా లేకుండా తమ తమ పనుల్లో నిమగ్నమైనప్పుడే అందరూ సమానమనే భావన వస్తుందని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. లక్డికాపూల్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. తమ అవసరాలను తీర్చేందుకు ఎవరో వస్తారు.. ఇస్తారు అనే ఎదురుచూడకుండా సాధ్యమైనంత వరకు పోరాడి సాధించుకోవాలన్నారు.


మహిళలు తలుచుకుంటే పురుషులు ఏ పని చేయలేరని అన్నారు. అనంతరం కల్చరల్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్ జిల్లాలోని మహిళా అధికారులకు పూల మొక్క బహుకరించి, శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి హరిప్రియ, వ్యవసాయ అధికారి గీతా రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి స్వరాజ్యలక్ష్మి, హార్టికల్చర్ అధికారి సునంద, పౌర సంబంధాల అధికారి పద్మశ్రీ, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి మోతి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed