ప్రధాని రేసుకు 'రేసిజం' అంశమే కాదు: రిషి సునక్

by Disha Web Desk 22 |
ప్రధాని రేసుకు రేసిజం అంశమే కాదు:  రిషి సునక్
X

లండన్: బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధాని కావడానికి రేసిజం అంశమే కాదని అన్నారు. ఆదివారం ది డెయిలీ టెలిగ్రాఫ్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. రేసిజం అనేది ఎవరి ఆలోచనల్లో ఉన్న అంశం కాదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అది సరైన ఆలోచన కాదని అన్నారు. ప్రధానమంత్రి కావడానికి ఉత్తమమైన వ్యక్తికి లింగం, జాతితో సంబంధం ఉండవని తెలిపారు. 'మన సమాజం నిర్వచించే లక్షణాలు కృషి, ఆకాంక్ష. ప్రపంచ స్థాయి విద్య ప్రతి బిడ్డ యొక్క జన్మ హక్కు. ప్రపంచాన్ని నడిపించే సమాజాన్ని నేను నిర్మించగలనని అనుకుంటున్నాను. సమగ్రత, మన చరిత్ర, సంప్రదాయాల గురించి మనం నిజంగా గర్వపడాలి. మన భవిష్యత్తు గురించి మాకు నిజంగా నమ్మకం ఉంది' అని చెప్పారు. తాను నమ్మిన విలువల కోసం పోరాటం చేస్తానని చెప్పారు. దేశానికి మేలు చేసే వాటి కోసం పోరాడుతానని అన్నారు. దీనిని ఆపేది లేదని అన్నారు. మరోవైపు వచ్చే వారం నుండి టోరీ సభ్యుల పోస్టల్ బ్యాలెట్‌లలో లింగం లేదా జాతి వంటి అంశాలు పాత్ర పోషిస్తాయనే వార్తలను ప్రత్యర్థి లిజ్ ట్రస్ తోసిపుచ్చారు. కాగా, సెప్టెంబర్ 5న నూతన ప్రధాని ఎవరో తేలనుంది.


Next Story

Most Viewed