పెళ్లి కాని యువతులే టార్గెట్.. కొత్త దందాకు తెరలేపిన స్పా మాఫియా

by Disha Web Desk 19 |
పెళ్లి కాని యువతులే టార్గెట్.. కొత్త దందాకు తెరలేపిన స్పా మాఫియా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత పొరుగు దేశం శ్రీలంక తీవ్ర ఆర్ధిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశనంటుతున్నాయి. దీంతో ప్రజలకు జీవనం కష్టమైపోయింది. అంతేకాకుండా ఆర్ధిక సంక్షోభం వల్ల శ్రీలంకలో మహిళలు భారీగా ఉద్యోగాలు కోల్పోయారు. దీన్ని ఆసరాగా తీసుకున్న స్పా మాఫియా అరాచకాలకు తెరలేపారు. స్పా ఓనర్స్ ఉద్యోగాలు కోల్పోయిన మహిళలను టార్గెట్ చేసుకుంటున్నారు. అనంతరం వారికి డబ్బు ఆశ చూపి వ్యభిచారం కూపంలోకి దింపుతున్నారు. అంతేకాకుండా కొన్ని స్పా సెంటర్‌లలో కేవలం పెళ్లికాని యువతులతోనే వ్యభిచారం నిర్వహిస్తూ డబ్బు దండుకుంటున్నారు స్పా మాఫియా.


Next Story

Most Viewed