- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేజర్ అభిలాషా బరాక్‌కు ప్రతిష్టాత్మక ‘యూఎన్’ అవార్డు.. ప్రధాని మోడీ ప్రశంసల జల్లు!
మేజర్ అభిలాషా బరాక్‌కు ప్రతిష్టాత్మక ‘యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్’ అవార్డు దక్కడంపై పీఎం మోడీ అభినందనలు తెలిపారు. ఇది దేశానికే గర్వకారణమన్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేజర్ అభిలాషా బరాక్ (Major Abhilasha Barak)కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ (X) వేదికగా అభినందనలు తెలిపారు. ఐక్యరాజ్యసమితి అందించే 'యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్' (UN Military Gender Advocate of the Year) అవార్డుకు ఆమె ఎంపిక కావడం పట్ల ప్రధాని మోడీ (Prime Minister Modi) ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మేజర్ బరాక్.. లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి తాత్కాలిక బలగాల (UNIFIL) లో ఎంగేజ్‌మెంట్ టీమ్ కమాండర్‌గా, జెండర్ ఫోకల్ పాయింట్‌గా తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఆమెకు దక్కిన ఈ గౌరవం ఆమె అసాధారణ సేవలకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.
ఈ అవార్డు మేజర్ బరాక్ ప్రతిభను గుర్తించడంతో పాటు, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దేశాల్లో భారతదేశం సుదీర్ఘకాలంగా అందిస్తున్న సహకారానికి దక్కిన గొప్ప గుర్తింపు అని ప్రధాని మోడీ కొనియాడారు. దేశానికి, మానవాళికి సేవ చేయాలనుకునే కోట్లాది మంది యువ భారతీయులకు, ముఖ్యంగా భారతీయ కుమార్తెలకు (మహిళలకు) ఆమె సాధించిన ఈ విజయం ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని తన సందేశంలో ఆకాంక్షించారు.






