కశ్మీర్​ఫైల్స్ సినిమాపై రేణుదేశాయ్ ప్రశంసలు

by Disha Web Desk 2 |
కశ్మీర్​ఫైల్స్ సినిమాపై రేణుదేశాయ్ ప్రశంసలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కశ్మీర్​ఫైల్స్ సినిమాను ఒక సినిమాలా కాకుండా ఒక హిస్టారికల్​మూమెంట్‌లా చూడాలని జమ్మూకశ్మీర్​మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్​సింగ్ పేర్కొన్నారు. నాగోల్‌లోని శుభం గార్డెన్‌లో డిజిటల్​హిందూ కాంక్లేవ్​కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో హిందువులపై జరిగిన దాడులను కండ్లకు కట్టినట్లు చూపించారని ఆయన తెలిపారు. ఈ సినిమా ద్వారా హిందువులపై జరిగిన దాడులపై చర్చ మొదలైందన్నారు. అనంతరం మధ్యప్రదేశ్​బీజేపీ ఇన్‌చార్జీ మురళీధర్​రావు మాట్లాడుతూ.. హిందువులను ఎదురించిన వారికి రాబోయే రోజుల్లో భవిష్యత్​ఉండదని ఆయన హెచ్చరించారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పలు పోస్టులు వస్తున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. కశ్మీర్ ఫైల్స్‌లో చూపించిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్​ఫైల్స్ బీజేపీ సినిమా కాదని, 7 లక్షల బ్రాహ్మణ కుటుంబాల కష్టాల ఆధారంగా తెరకెక్కించారని ఆయన వెల్లడించారు. అనంతరం సినీ నటి రేణుదేశాయ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ రిలీజియన్ రైట్ ఉంటుందని, ఎవరి మతాన్ని వారు గొప్పగా చూడడంతో పాటు ఇతర మతాలను కూడా గౌరవించాలన్నారు. తాను ఏ ఒక్క మతానికి వ్యతిరేకం కాదని, తాను హిందూవునని చెప్పుకోవడానికి మాత్రం గర్వపడుతున్నట్లు స్పష్టం చేశారు. మతాలకన్నా ముందు మనుషులమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed