పీసీబీ టార్గెట్ @5000 కోట్లు.. సిరీస్ పై పాక్ స్పెషల్ ఫోకస్

by Disha Web |
పీసీబీ టార్గెట్ @5000 కోట్లు..  సిరీస్ పై పాక్ స్పెషల్ ఫోకస్
X

ఇస్లామాబాద్ : నాలుగు దేశాల క్రికెట్ సిరీస్ నిర్వాహణపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గత కొంతకాలంగా ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ జట్ల మధ్య ప్రత్యేకంగా సిరీస్ ప్లాన్ చేయాలని పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వచ్చేవారం దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సమావేశం(ఐసీసీ)ఎదుట ఈ ప్రపోజల్ పెట్టనున్నట్టు పీసీబీ వెల్లడించింది. ఇది గనుక వర్కౌట్ అవుతే ఏకంగా రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని పాక్ బోర్డు అంచనా వేస్తోంది. ఇదే విషయాన్ని ఐసీసీకి వివరించి మిగతా దేశాలను కూడా ఈ సిరీస్ ఆడేలా చేయించాలని పీసీబీ తెగ ఉబలాటపడుతోంది. కాగా, ఈ సిరీస్‌లో ఆడబోమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా గతంలోనే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed