బీజేపీ వ్యతిరేక కూటమిని నడిపించడంపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 13 |
బీజేపీ వ్యతిరేక కూటమిని నడిపించడంపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
X

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు యూనిటెడ్ ప్రొగ్రెసీవ్ ఆలియన్స్(యూపీఏ)కు బాధ్యత వహించే ఆసక్తులు లేవని చెప్పారు. 'బీజేపీపై పోరాటానికి అన్ని పార్టీలతో కలిపిన కూటమికి అధ్యక్షత వహించాలన్న వాదనలపై ఆయన స్పందించారు. ఈ మధ్యనే కొందరు ఎన్సీపీ యువ కార్యకర్తలు యూపీఏ చైర్ పర్సన్ గా ఉండాలని కోరారు.


కానీ, ఆ స్థానం పై ఎలాంటి ఆసక్తి లేదు. నేను దానిలో తల దూర్చాలనుకోలేదు. నేను ఆ బాధ్యతలను స్వీకరించలేను' అని అన్నారు. బీజేపీ కి ప్రత్నామ్యాయం గా ఏమైనా ఏర్పాట్లు ఉంటే నా సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు. ఒకవేళ బీజేపీ వ్యతిరేక కూటమి ఉంటే అందులో కాంగ్రెస్ తప్పక ఉండాలని అన్నారు. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి కార్యకర్తలు ఉన్నారని తెలిపారు.



Next Story