హామీల కంటే ఎక్కువే చేస్తున్నామన్న కేటీఆర్.. పాత హామీలను సంగతేంటంటున్న నెటిజన్స్

by Disha Web Desk |
హామీల కంటే ఎక్కువే చేస్తున్నామన్న కేటీఆర్.. పాత హామీలను సంగతేంటంటున్న నెటిజన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంపై సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై నిరుద్యోగులు, ప్రతిపక్షాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ ప్రకటించిన కొద్ది సేపటికే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అధినేతకు పాలభిషేకాలు నిర్వహిస్తూ సంబురాలు చేసుకున్నారు. అయితే, నోటిఫికేషన్ల ప్రకటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకంటే ఎక్కువనే చేస్తుందని రుజువైందని పేర్కొన్నారు.

2014 ఎన్నికల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ వాగ్దానం చేశారని ఇప్పటికే 1,33,942 ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా.. తాజా 91,142 ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తూ యువతకు బొనాంజా ప్రకటించిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన ట్వీట్ పై నెటిజన్లు తెగ స్పందిస్తూ ఇప్పటి వరకు హామీలు ఇచ్చి మరిచిపోయిన వాటిని గుర్తు చేస్తున్నారు. '' సార్ మీరు నిరుద్యోగ భృతి గురించి 2 సంవత్సరాల క్రితమే ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు.. దానికి మీ సమాధానం ఏమిటి? దయచేసి తెలంగాణ ప్రజలకు తెలపండి.'' అంటూ ప్రశ్నిస్తున్నారు.



Next Story

Most Viewed