ప్రధాని మోడీపై నేపాల్ ప్రధాని ప్రశంసల వర్షం

by Disha Web |
ప్రధాని మోడీపై నేపాల్ ప్రధాని ప్రశంసల వర్షం
X

న్యూఢిల్లీ: కరోనా సమయంలో భారత ప్రభుత్వం పనితీరుపై నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ప్రశంసల వర్షం కురిపించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ కు విచ్చేసిన ఆయన శనివారం ప్రధాని మోడీతో కలిసి పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. రెండు దేశాలు తాము చేపడుతున్న కీలక కార్యక్రమాలు భారత్-నేపాల్ సంబంధాలను నూతన శిఖరాలను అధరోహిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముందు చూపు ఉన్న ప్రధాని మోడీ నాయకత్వంలో భారత పురోగతిని మెచ్చుకుంటున్నాను.

కొవిడ్-19పై భారత సమర్థవంతమైన పోరు, వైరస్ ఎదుర్కోవడంలో నేపాల్ కు మెడిసిన్, వ్యాక్సిన్ అందివ్వడం చూశాం. ఇరు దేశాల మధ్య ఫలప్రదమైన స్నేహపూర్వక చర్చలు కొనసాగినట్లు తెలిపారు. సరిహద్దు వాణిజ్యానికి ప్రాధాన్యం ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. దీనిలో భాగంగానే జయానగర్-కుర్తా రైల్ లైన్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి పథకాలు గొప్ప భాగస్వామ్యాన్ని ఇవ్వడమే కాకుండా ఎటువంటి అవాంతరాలు మార్పిడిలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇక భారత ప్రభుత్వ సహకారంతో నేపాల్ లో నిర్మించిన సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. విద్యుత్ సహకారంపై ఇరుదేశాల ఉమ్మడి ప్రకటన భవిష్యత్ సహకారానికి బ్లూప్రింట్‌గా నిరూపితమవుతుందని అన్నారు. అంతేకాకుండా నేపాల్ శాంతి, శ్రేయస్సు, అభివృద్ధే ధ్యేయంగా భారత్ సహకారం అందిస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారు.


Next Story

Most Viewed