రూ.250కే ఆన్‌లైన్ సెక్స్.. యువకులే టార్గెట్‌గా న్యూడ్​ కాల్స్​

by Disha Web |
రూ.250కే ఆన్‌లైన్ సెక్స్.. యువకులే టార్గెట్‌గా న్యూడ్​ కాల్స్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: "రాత్రి 10 గంటల సమయం. నిద్రకు ఉపక్రమించే ముందు మరోసారి మొబైల్​ ఫోన్​ ను చేతుల్లోకి తీసుకుని, నెట్​ ఆఫ్​ చేసే ముందు వాట్సాప్​ లో వచ్చిన మెస్సేజ్​ లన్నీ క్లియర్​ చేసే పనిలో పడ్డాడో యువకుడు. అప్పుడు ఒక తెలియని నెంబర్​ నుంచి హాయ్​ అని మెస్సేజ్​ వచ్చింది. నెంబర్​ కూడా ఎక్కడిదో. మనోళ్లే ఎవరైనా కావచ్చు అని తిరుగు రిప్లై హలో అని ఇచ్చాడు. అంతే.. ఇక రెచ్చగొట్టే మెస్సేజ్​ లు ఒకటి వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి. అందులో మొదటిదే.. వీడియో కాల్​ సెక్స్​ రూ. 250 ఓన్లీ. 15 నిమిషాలు, టోటల్​ న్యూడ్​. అదే ఫైనల్​ రేట్​. నేను రెడీ.. నువ్వు కూడా రెడీనా.. పేటీఎం లేదా ఫోన్​ పే.. గూగుల్​ పే.. ఎలా పంపిస్తారు.. ఐయామ్​ రెడీ డార్లింగ్​.. అంటూ వరుస మెస్సేజ్​ లు వచ్చాయి. ముందుగా తేలిగ్గా తీసుకున్నా.. ఆ తర్వాత మాత్రం సదరు యువకుడు కూడా టెంప్ట్​ అయ్యాడు. రిప్లై ఇవ్వడం మొదలు పెట్టాడు. అవతలి నుంచి ఇంకా కవ్వించడం స్టార్ట్​ అయింది. నిద్ర మాయమైంది. చాటింగ్​ లో బిజీ అయ్యాడు. ముందుగా డెమో అంటూ అడిగాడు. చివరకు రూ. 100 పే చేస్తే 2 నిమిషాలు డెమో అంటూ రిప్లై వచ్చింది. వందే కదా.. అని పంపించాడు. డెమో కాల్​ కూడా వచ్చింది. ఇదే సదరు యువకుని కొంప ముంచింది. ''

నైట్​ టార్గెట్​

వీడియో న్యూడ్​ కాల్స్​ అంటూ రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కొత్త కొత్త నెంబర్ల నుంచి వాట్సాప్​ మెస్సేజ్​ లు ఇటీవల కాలంలో జోరందుకున్నాయి. మన రాష్ట్రాన్ని.. నార్త్​ స్టేట్స్​ టార్గెట్​ చేసినట్లుగా మారింది. ప్రధానంగా ఢిల్లీ, పంజాబ్​ వంటి ప్రాంతాల నుంచి ఈ ఫోన్లు వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. వాట్సాప్​ మెస్సేజ్​ నుంచి హాయ్​ అంటూ పంపించి.. పరిచయం పెంచుకుంటున్నారు. అటు నుంచి వచ్చిన మెస్సేజ్​ కు రిప్లై వెళ్లిందంటే ఇక అంతే. వారి మాయలో పడేంత వరకు రెచ్చగొడుతూనే ఉంటారు.

తెలివిగా వలలోకి

ముందుగా వంద.. రెండొందల నుంచి బేరాలకు దిగుతున్నారు. మెస్సేజ్​ లు పంపిన తర్వాత.. రిప్లై వెళ్తే వెంటనే చాటింగ్​ స్టార్ట్​ చేస్తున్నారు. పూర్తి న్యూడ్​ వీడియో కాల్​ చేస్తామని, రూ. 250 వరకు చెల్లిస్తే 15 నిమిషాలు మీరు చెప్పినట్లుగా వీడియో కాల్​ లో చేస్తామంటూ రెచ్చగొడుతున్నారు. అంతేకాదు.. నమ్మకం కోసం న్యూడ్​ పిక్స్​ లేదా.. డెమో కాల్ అంటూ ఆఫర్​ ఇస్తున్నారు. రూ. 100కే డెమో కాల్​ చేస్తామంటూ కవ్విస్తున్నారు. వందే కదా అని తేలిగ్గా తీసుకుని డెమో కాల్​ కు కనెక్ట్​ అయితే చాలు.. ఇగ అంతే. కనీసం నిమిషం నుంచి రెండు నిమిషాలు డెమో కాల్​ చూపించి, ఆ తర్వాత పూర్తి న్యూడ్​ వీడియో కాల్​ 10 నుంచి 15 నిమిషాలకు రూ.250 అంటూ కవ్వింపులు మొదలవుతున్నాయి. అప్పటికే రూ. 100తో డెమో కాల్​ తో టెంప్ట్​ అవుతున్న యూత్​.. అడిగిందే తడువుగా రూ. 250 చెల్లిస్తున్నారు.

రూ. 250 తో మొదలై.. వెయ్యి వరకు వసూల్​

ఇలా రూ. 250తో మొదలైన వీడియో కాల్​ చాటింగ్​.. కనీసం రూ. 1000 వరకు వెళ్తోంది. ముందుగా 250కి 15 నిమిషాలు కాల్​ అంటూ బుజ్జగిస్తూ.. ఆ తర్వాత ఇంకో వంద రూం చార్జీ, ఫుల్​ న్యూడ్​ తో క్లారిటీ వీడియోకు వంద, ఇలా.. చెప్తూ వెయ్యి వరకు ట్రాన్స్​ఫర్​ చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఐదో, పది నిమిషాలో న్యూడ్​ వీడియో కాల్​ వస్తోంది.

ఇక బ్లాక్​ మెయిలింగ్​ షురూ

వెయ్యి వరకు పే చేసి న్యూడ్​ వీడియో కాల్​ వచ్చిన తర్వాత అటు నుంచి కూడా మీ వీడియో కూడా చూపించాలి అంటూ రెచ్చగొడుతున్నారు. అప్పటికే ఆ మాయలో పడిపోయిన యువకులు.. అంతా ఓపెన్​ చేసి వాళ్ల కెమెరా ముందు ఉంటున్నారు. కాల్​ పూర్తయిన తర్వాత అసలు సమస్య మొదలవుతోంది. వెంటనే ఇప్పటి వరకు వచ్చిన వీడియో రికార్డింగ్​ మళ్లీ వాట్సాప్​ కు వస్తోంది. దీంతో ఖంగుతింటున్న యువకులు.. తిరిగి ప్రశ్నిస్తే వెంటనే బ్లాక్​ మెయిలింగ్​ స్టార్ట్​ అవుతోంది. ఈ వీడియోను సోషల్​ మీడియాలో వైరల్​ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. వెంటనే పదివేలు పంపించాలనే డిమాండ్​ మొదలవుతోంది. నెత్తీనోరు బాదుకుంటూ వారిని కన్విన్స్​ చేసే ప్రయత్నం సదరు యువకుల వైపు నుంచి ఉంటోంది. కానీ, న్యూడ్​ వీడియో కాల్​ చేసిందే బ్లాక్​ మెయిలింగ్​ కోసం. దీంతో ఏకంగా యువకుల ఖాతాల్లో ఎంతుందో స్క్రీన్​ షాట్​ పంపించాలంటూ అవతలి నుంచి మెస్సేజ్​ లు రావడంతో.. ఉన్నదాంట్లోనే ఎంతో కొంత పే చేస్తున్నారు. కానీ, ఇది ఒక్కరోజుతో సమిసిపోయే సమస్యగా ఉండటం లేదు. మళ్లీ వారానికో, పది రోజులకో ఈ బ్లాక్​ మెయిలింగ్​ బ్యాచ్​ నుంచి సమాచారం వస్తూనే ఉంటోంది.

హైదరాబాద్​ లో లక్షల మంది బాధితులు

ఒక్కరో, ఇద్దరో కాదు.. కేవలం హైదరాబాద్​ లోనే లక్షల మంది యువత ఇలాంటి న్యూడ్​ కాల్స్​ కు బాధితులుగా మారారు. బయటకు చెప్పుకోలేక.. పోలీసులకు ఫిర్యాదు చేయలేక వేలల్లో సమర్పించుకుంటున్నారు. హాయ్​ అని వచ్చిన ఒక్క మెస్సేజ్​ కు రిప్లై ఇచ్చినందుకు తమ పరువును రోడ్డున పడేసుకుంటున్నారు. కొంతమంది సైబర్​ పోలీసులకు కూడా సమాచారమిస్తున్నారు. కానీ, సైబర్​ పోలీసులకు ఇలాంటి కేసులను డీల్​ చేసే సమయం లేకపోవడంతో.. ఈ దందా కొనసాగుతోంది. కొన్ని నెంబర్లను ట్రేస్​ చేసినా.. అవన్నీ ఢిల్లీ, పంజాబ్​, యూపీ వంటి ప్రాంతాలకు చెందినవారిగా తేలుతోంది. ఇలా ఒక్కటో, పదో నెంబర్లు కాదు.. వేల సంఖ్యల్లో ఫోన్​ నెంబర్లు ఉంటున్నాయి. అందుకే యూత్​ జాగ్రత్తగా ఉండాల్సిందే.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed