ఎంపీ మాధవ్‌వి పోరంబోకు వేషాలు కాలవ శ్రీనివాసులు

by Disha Web Desk |
ఎంపీ మాధవ్‌వి పోరంబోకు వేషాలు కాలవ శ్రీనివాసులు
X

దిశ, ఏపీ బ్యూరో : ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఒక పార్లమెంటు సభ్యుడు మహిళలతో అసభ్యకరంగా నగ్న వీడియో కాల్స్ చేస్తూ వేధించడం అత్యంత దుర్మార్గం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అన్నారు. ప్రజల సమస్యల కోసం పని చేయాల్సిన పవిత్రమైన పార్లమెంటు సభ్యుడిగా ఉన్న గోరంట్ల మాధవ్ ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని మండిపడ్డారు. రెడ్ హ్యాండెడ్‌గా వీడియోతో దొరికిపోయినప్పటికీ.. అది మార్ఫింగ్ వీడియో అంటూ తప్పించుకోవాలని ప్రయత్నిచి అడ్డంగా బుక్కయ్యారు అని మండిపడ్డారు.

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వీడియో వ్యవహారంపై కాలవ శ్రీనివాసులు ఓ ప్రకటన విడుదల చేశారు. 'పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాక ఏ రోజూ ప్రజా సమస్యలపై పోరాడిందీ లేదు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం కేంద్రాన్ని అడిగిందీ లేదు. కానీ తోటి ఎంపీలపై దాడులు చేస్తూ, బూతులు తిడుతూ, పారిశ్రామిక వేత్తల్ని బెదిరిస్తూ అసాంఘిక శక్తిగా నడుచుకుంటున్నారు. పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ పాడు పనులు చేసి రాష్ట్రం పరువు తీశారు. అలాంటి వ్యక్తికి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే నైతిక హక్కు లేదు. ఈ వ్యవహారంపై మాధవ్ కోరినట్లుగా కేంద్ర ఫోరెన్సిక్ విభాగంతో దర్యాప్తు జరిపి నిజాలు నిగ్గు తేల్చాలి. కళంకితులైన వ్యక్తులు చట్ట సభల్లో కొనసాగడానికి ఎంత మాత్రమూ అర్హత లేదు. తక్షణమే మాధవ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి అని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed