రష్యా, ఉక్రెయిన్ వార్: ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం..

by Disha Web Desk 19 |
రష్యా, ఉక్రెయిన్ వార్: ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్దం 18వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌‌ను మిస్సైల్స్, బాంబుల దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది రష్యా. గత కొన్ని రోజులుగా సాగుతోన్నషెల్లింగ్ మొత్తం ఉక్రెయిన్ దేశాన్ని నాశనం చేసింది. ఉక్రెయిన్, రష్యా రెండు దేశాల్లో ఏ ఒక్కటీ తలవంచేందుకు సిద్ధంగా లేకపోవడంతో యుద్దం ఇప్పుడే సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు విధించిన.. రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోజురోజుకు దాడులు ఇంకా పెంచుతోంది. అయితే, ఈ రెండు దేశాల మధ్య యుద్దం తీవ్రం కావడంతో ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. 'రష్యా భీకరంగా దాడుల కారణంగా.. ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని పోలాండ్ దేశానికి తరలిస్తున్నట్లు ప్రకటించింది'.



Next Story