నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. పాలిసెట్ టైమింగ్ ఇదే

by Disha Web Desk |
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. పాలిసెట్ టైమింగ్ ఇదే
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాలిసెట్​ప్రవేశ పరీక్షను ఈనెల 30వ తేదీన నిర్వహించనున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్​పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు వ్యవసాయ, ఉద్యాన‌వ‌న‌, వెట‌ర్నరీ డిప్లొమా కోర్సుల‌కు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు క‌ల్పించ‌నున్నట్లు ఎస్‌బీటెట్​కార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,13,974 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 61,287 మంది అబ్బాయిలు, 52,687 మంది అమ్మాయిలు ఉన్నారు. ఎంపీసీ నుంచి 69,661 మంది దరఖాస్తు చేసుకోగా.. ఎంబైపీసీ నుంచి 44,313 మంది విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 365 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులను ఉదయం 10 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. కాగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష నిర్వహిస్తున్నారు. 11 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.


Next Story

Most Viewed