మోటర్ల పై కేంద్రం మొండి పట్టుదల వీడాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web |
మోటర్ల పై కేంద్రం మొండి పట్టుదల వీడాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ మోటార్లకు మీటర్లను అమర్చాలన్న అంశంపై కేంద్రం మొండి పట్టుదలను వీడాలని అగ్రిమినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో అన్నారు. ఈ మేరకు రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రాజకీయ కోణంలో చూసే ధోరణిని కేంద్రం మానుకోవాలన్నారు. కేంద్రంలోని బీజేపీ రైతులకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని అన్నారు. గురువారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీటర్ల బిగింపు, వరి సాగు పెంచాలని చేసిన సూచనలపై మంత్రి స్పందించారు.

అమెరికా పత్తి సాగులో ఎకరానికి 30వేల మొక్కలు.. నిరంజన్ రెడ్డి

అమెరికా యాంత్రిక వ్యవసాయంలో ఎకరానికి సుమారు 30వేల పత్తి మొక్కలు ఉన్నాయని, అధిక సాంద్రత పద్దతిలో చీడ, పీడల బెడద కూడా తక్కువగా ఉంటుందని అగ్రి మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈమేరకు పత్తి సాగులో ఆధునిక పద్ధతులు, అధిక సాంద్రత పత్తి సాగుపై అధ్యయనంలో ఉన్న ఆయన అమెరికాలో 13వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్న రిచర్డ్ కెల్లీ, బ్రాడ్ విలియమ్స్ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. అమెరికాలో రోజుకు 70 టన్నుల పత్తి తీసే యంత్రాలున్నాయని, ఇవి ఒక రోజుకు 50 నుంచి 70 హెక్టార్లలో సింగిల్ టైమ్ హర్వెస్టింగ్ జరుగుతన్నదని ఇందుకు 500గ్యాలన్ల డీజీల్ వినియోగం జరుగుతుందన్నారు. కాగా టెన్నెస్సీ రాష్ట్రంలో 200 ఏండ్లుగా పత్తి పంటే ప్రధానంగా ఉందన్నారు. ఈ రాష్ట్రంలో ఏటా 5.5 లక్షల నుంచి 6.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుతుందని తెలిపారు. మంత్రి వెంట విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు,పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed