వెన్నుపోటు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన.. మంత్రి కొడాలి నాని

by Disha Web Desk 13 |
వెన్నుపోటు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన.. మంత్రి కొడాలి నాని
X

దిశ, ఏపీ బ్యూరో: వెన్నుపోటు రాజకీయాలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లో ప్రవహించే రక్తం వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిలదని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్‌లో ప్రవహించే రక్తంలో ఎదురుగా వచ్చి గుండెల్ని చీల్చగల దమ్ము, ధైర్యం ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడులా వెన్ను చూపించే వ్యక్తి కాద‌ని కొడాలి నాని అన్నారు. మీలా పప్పుల్లా వెనుక నుంచి వెన్నుపోటు పొడిచే రక్తం కాదు. నీచాతి నీచమైన, నికృష్టమైన బతుకు మీది. అందుకే ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టార‌ని పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద కొడాలి నాని శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రం సమగ్రమైన అభివృద్ధి జరగాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలని అసమానతలకు తావులేకుండా పరిపాలనను, అభివృద్ధిని వికేంద్రీకరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. అయితే కొంతమంది శాసనసభ్యులుగా కూడా గెలవలేని బచ్చాగాళ్లు, ప్రజల్లో ఆదరణ కూడా లేని, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే చెత్తగాళ్లు సీఎం జగన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ లోకేశ్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. మా తాత ముఖ్యమంత్రి, మాకో పార్టీ ఉంది. మా బాబు ముఖ్యమంత్రి, అతనో ప్రపంచ మేధావి.. ఆయనకో పెద్ద విజన్‌ ఉందంటూ సొల్లు మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడంటూ ధ్వజమెత్తారు. నిజంగా చంద్రబాబుకు విజనరీనే ఉంటే.. తన కొడుకుని ఎమ్మెల్యేగా కూడా ఎందుకు గెలిపించలేకపోయాడని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

లోకేష్ బుద్దీ జ్ఞానం లేకుండా మాట్లాడొద్దు..

రాష్ట్రంలో పప్పు గా గుర్తింపు పొందిన లోకేష్ అయితే కనీసం బుద్ధీ- జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. జగన్‌ ఏం చదివారు, ఏ క్లాసులో పాస్ అయ్యారని ప్రశ్నించడంపై మండిపడ్డారు. నీ మాదిరిగా, నీ తండ్రి రికమండేషన్‌తో ఊళ్లోవాళ్లు కట్టిన ఫీజులతో, పక్క దేశాలకు వెళ్లి చదువుకున్న వ్యక్తి కాదు జగన్ అని చెప్పుకొచ్చారు. నీ మాదిరిగా, తాత పేరు, తండ్రి పేరు చెప్పుకుని... దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి, మీడియా ముందే మొరిగే వ్యక్తివి నీవు. బాబాయ్‌ని బంధించిందీ, తాతను చంపింది మీరు కాదా..? అని కొడాలి నాని ప్రశ్నించారు. 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లతో రాష్ట్ర ప్రజలు వైఎస్‌ జగన్‌ని ముఖ్యమంత్రిగా చేశారని ఈ విషయం గుర్తురెగాలని సూచించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. సోనియాగాంధీ పేరు చెప్తేనే భయపడేవాడని.. కానీ జగన్ భయపడకుండా సొంతంగా పార్టీ పెట్టుకున్న దమ్మున్న మగాడు అని చెప్పుకొచ్చారు. 74 ఏళ్ళ వృద్ధుడైన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన బతుకులు మీవి. తెలుగుదేశం పార్టీ ని లాక్కుని, ముఖ్యమంత్రి పదవిని దొంగిలించిన దొంగలు మీరు. అలాంటి నీచులైన మీకు ముఖ్యమంత్రి జగన్‌ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. బాబాయ్‌ని చంపి రాజకీయ లబ్ది పొందాల్సిన ఖర్మ జగన్‌కి కానీ వైఎస్ఆర్ కుటుంబానికి కానీ లేదు అని మంత్రి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు.

మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం..

నారా లోకేశ్‌కు దమ్ముంటే గుడివాడలో నాపై పోటీ చేసి గెలవాలి. జగన్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబును ఎంతో గౌరవంగా సంబోధించారు. కానీ లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. శాసన సభకు చట్టాలు చేసే హక్కులు ఉన్నాయి. మా పరిధులు, పరిమితులు ఏంటో మాకు తెలుసు. ఏ వ్యవస్థ అయినా మరో వ్యవస్థలో జోక్యం చేసుకోనంతవరకూ బాగానే ఉంటుంది. అలా కాకుండా జోక్యం చేసుకుంటే అనేక వివాదాలు ఏర్పడి రాష్ట్రం నష్టపోతుంది. కొంతమంది వ్యక్తులు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వేరే వ్యవస్థలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అది కరెక్ట్‌ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉంది. మూడు రాజధానులు, వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు.



Next Story

Most Viewed