ఆ హీరోను పెళ్లి చేసుకోవాలనుంది.. యంగ్ బ్యూటీ

by Dishanational2 |
ఆ హీరోను పెళ్లి చేసుకోవాలనుంది.. యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి 'మిమి' ఫేమ్ సాయి తమంకర్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది.ఇటీవల ఓ చానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన ఆమె చిన్నప్పటి నుంచి అమీర్ ఖాన్‌ అంటే తనకు చెప్పలేనంత పిచ్చి అని, పెద్దయ్యాక అతన్ని పెళ్లి చేసుకుంటానని వాళ్ల అమ్మతో చెప్పినట్లు తెలిపింది. అంతేకాదు ఇప్పటికీ అతనికి పెద్ద అభిమానన్న ఆమె 'గజిని'లో అమీర్ ఖాన్ కోసమే హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించేందుకు ఒప్పుకున్నానని వెల్లడించింది. ఈ క్రమంలోనే 'హంటర్' సినిమాలో బోల్డ్ లుక్స్‌లో కనిపించడంపై స్పందించిన సాయి.. బికినీ ధరించడాన్ని తన అభిమానులు హృదయపూర్వకంగా స్వాగతించారని, కానీ, కొంతమంది కావాలనే విమర్శలపాలు చేశారని వాపోయింది. ఇక చివరగా తనకు తన కుటుంబానికి ఏదైతే సౌకర్యంగా ఉంటుందో అదే ముఖ్యమని భావిస్తానంటోంది.



Next Story

Most Viewed