ఎన్నికల వేళ తండ్రిని తల్చుకుని YS షర్మిల ఎమోషనల్ ట్వీట్.. రేర్ పిక్ షేర్ చేసిన APCC చీఫ్

by Satheesh |
ఎన్నికల వేళ తండ్రిని తల్చుకుని YS షర్మిల ఎమోషనల్ ట్వీట్.. రేర్ పిక్ షేర్ చేసిన APCC చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తల్చుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌కు తన తండ్రితో అప్యాయంగా దిగిన ఫొటోను షర్మిల యాడ్ చేశారు. ‘‘రాష్ట్ర భవితను మార్చే ఎన్నికల పండగ వేళ, ఒకప్పడు మా తండ్రి డాక్టర్ స్వర్గీయ వైఎస్.రాజశేఖర రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన కడప నియోజకవర్గం నుండి పోటీ చేయటం ఒక అపురూపమైన అనుభూతి. ఆయనను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ అమ్మ నాన్న ఆశీస్సులు, దేవుడి దీవెన, ప్రజల ఆశీర్వాదం నాకున్నాయని నమ్ముతున్నాను’’ అని షర్మిల ట్వీట్ చేశారు.

కాగా, వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థినిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. తన సోదరుడు వైఎష్ అవినాష్ రెడ్డిపైనే షర్మిల పోటీకి సిద్ధమవ్వడం ఏపీ రాజకీయాల్లో కాకరేపింది. షర్మిల ఎంట్రీతో కడప పార్లమెంట్ ఎన్నిక ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ సీట్లకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ మొదలు కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌ల ఓటర్లు క్యూ కట్టారు.

Next Story

Most Viewed