రాష్ట్రపతికి చేరిన లోక్‌సభ విజేతల జాబితా.. వాట్స్ నెక్ట్స్ ?

by Hajipasha |
రాష్ట్రపతికి చేరిన లోక్‌సభ విజేతల జాబితా.. వాట్స్ నెక్ట్స్ ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్బీర్‌సింగ్‌ సంధూ గురువారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ఈసందర్భంగా లోక్‌సభ విజేతల జాబితాను ఆమెకు సమర్పించారు. ప్రజాస్వామ్య పండగను విజయవంతంగా నిర్వహించడంపై ఎన్నికల సంఘం, కేంద్ర, రాష్ట్ర అధికారులు, సిబ్బంది, భద్రతా బలగాలకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పూర్తి చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న కోట్లాది ఓటర్లనూ ముర్ము ప్రశంసించారు. కొత్త లోక్‌సభ ఎంపీల జాబితా రాష్ట్రపతి వద్దకు చేరడంతో 18వ లోక్‌సభ ఏర్పాటుకు ఇక అధికారిక ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా, రాష్ట్రపతితో సమావేశం అనంతరం సీఈసీ, ఎన్నికల కమిషనర్లు కలిసి ఢిల్లీలోని మహాత్మా గాంధీ స్మారక రాజ్ ఘాట్‌ను సందర్శించారు. జాతిపితకు ఘన నివాళులు అర్పించారు. హింసకు తావు లేకుండా.. పుకార్లు, వదంతులకు చోటు లేకుండా శాంతియుతంగా జరిగిన ఈ ఎన్నికలను జాతిపిత మహాత్మాగాంధీకి అంకితం ఇస్తున్నామని వారు వెల్లడించారు.Next Story

Most Viewed