- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
16- 44 ఏళ్ల వయస్సులో అదే హీరోతో నటించి ఇండస్ట్రీలోనే హిట్ కొట్టిన ఏకైక హీరోయిన్!
అప్పట్లో హీరోయిన్ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో హీరోయిన్ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశారనడంలో అతిశయోక్తిలేదు. ఒక రమ్యకృష్ణ లాంటి కథానాయికలు లేడీ విలన్ పాత్రల్లో నటించి.. నెటిజన్ల మనసులో టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగులో సుదీర్ఘకాలం కొనసాగించిన హీరోయిన్లు బాగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. రమ్యకృష్ణ(Ramya Krishna)తో పాటు రాధిక (Radhika), విజయశాంతి (Vijayashanti), మీనా (Meena)వంటి వారు మంచి నటీమణులుగా పేరు సంపాదించుకున్నారు.
ప్రజెంట్ కూడా త్రిష (Trisha), కాజల్ (Kajal)వంటి హీరోయిన్లు మంచి అవకాశాలు అందుకుంటూ సినీ కెరీర్ ఇంకా కొనసాగించడం విశేషం. ఇదంతా పక్కన పెడితే.. 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరోయిన్ ఈమె అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. మరీ ఈ న్యూస్ ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. అదే తెలుగు హీరోతో 40 ప్లస్‌లో మరో సూపర్ హిట్ కొట్టడం నిజంగా గ్రేట్ అంటూ ఈ హీరోయిన్‌పై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే..?
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన నటి మీనా. ఈ ముద్దుగుమ్మ టీనేజ్ వయస్సులోనే హీరోయిన్ అయిపోయింది. ఈ నటికి పదిహేను ఏళ్ల వయస్సులోనే సీతారామయ్యగారి మనవరాలు(Sitaramayyagari manavaralu) సినిమాలో అవకాశం వచ్చింది. ఈ మూవీలో మీనా కెరీర్ ఏ మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ దెబ్బతో మీనా నెక్ట్స్ విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కథానాయికగా నటించిన చంటి చిత్రంలో చాన్స్ దక్కించుకుంది.
ఊహించని విజయం సాధించడంతో ఈ నటికి 16 వయస్సులోనే టాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కట్టాయి. ఇక టాలీవుడ్ అగ్ర హీరోలైన నాగార్జున(Nagarjuna), మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వంటి హీరోల సరసన నటించే చాన్స్ దక్కింది. అయితే మీనా 16 ఏళ్ల వయస్సులో వెంకటేష్ కు జోడిగా నటించి మంచి టాక్ సంపాదించుకుంది. అదే హీరోతో 44 ఏళ్ల వయస్సులో దృశ్యం 2 చిత్రంలో నటించింది. ఈ మూవీ కూడా భారీ విజయం అందుకుంది.






