కొత్త బ్రెజా కారును విడుదల చేసిన మారుతీ సుజుకి!

by Disha Web |
కొత్త బ్రెజా కారును విడుదల చేసిన మారుతీ సుజుకి!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా తన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ బ్రెజా కొత్త వెర్షన్‌ను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 7.99 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కారు మాన్యూవల్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి రెండు వేరియంట్లలో లభిస్తుందని, ధరల శ్రేణి రూ. 7.99 లక్షల నుంచి రూ. 13.96 లక్షల మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది. సరికొత్త బ్రెజా మోడల్‌కు భారతీయ వినియోగదారుల నుంచి మెరుగైన ఆదరణ ఉందని, భవిష్యత్తులో ఎస్‌యూవీ విభాగంలో మరిన్ని కార్లను తీసుకురావాలనే ఆలోచన ఉందని మారుతీ సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ హిసాషి టకుచీ తెలిపారు.

అత్యాధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా బ్రెజా మోడల్ డిజైన్ పరంగా కూడా వినియోగదారులను ఆకట్టుకుంటునని, కొత్త జనరేషన్ వినియోగదారులను ఆకట్టుకోవడమే కాకుండా మెరుగైన ఫీచర్లను అందించామని కంపెనీ వివరించింది. దేశీయ మార్కెట్లో మారుతీ బ్రెజా కొనాలౌకునే కస్టమర్ల కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. త్వరలో డెలివరీలు చేయనున్నామని కంపెనీ స్పష్టం చేసింది. ఈ వాహనాన్ని కావాలనుకునే కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ల వద్ద రూ. 11 వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా వినియోగదారుల కోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ పథకాన్ని కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా కస్టమర్లు నెలకు రూ. 18.300 చెల్లించి వాహనాన్ని కొనవచ్చు. ఇందులో వాహన రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ కారు 5-స్పీడ్ మాన్యూవల్ వెర్షన్ లీటర్‌కు గరిష్టంగా 20.15 కిలోమీటర్లు, ఆటోమెటిక్ వెర్షన్ లీటర్‌కు 19.80 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed