ప్రణాళికాబద్ధంగా మన ఊరు - మన బడి కార్యక్రమ అమలు: కలెక్టర్ జి.రవి

by Web Desk |
ప్రణాళికాబద్ధంగా మన ఊరు - మన బడి కార్యక్రమ అమలు: కలెక్టర్ జి.రవి
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్: ప్రణాళికాబద్ధంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి తెలిపారు. గురువారం మన ఊరు-మన బడి కార్యక్రమం పై ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ జూమ్ ద్వారా రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మన ఊరు మన బడి కార్యక్రమం అమలుకు ప్రతి మండలానికి ఇంజనీరింగ్ ఏజెన్సీని కేటాయించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమం పై పూర్తి అవగాహన తో మాట్లాడే విధంగా ప్రతి మండలంలో ఒక టీవోటీ ఎంపిక చేయాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. కొడిమ్యాల మండలం లో మన ఊరు మన బడి అవగాహన కార్యక్రమం నిర్వహించకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే అవగాహన కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. మార్చి 8న మన ఊరు మన బడి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం సూచించిన 12 అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రొఫార్మా రూపొందించామన్నారు.

ఈ కార్యక్రమం అమలుకు నిర్వహణ కమిటీ ప్రత్యేకంగా రెండు బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ నిధుల కొరకు ఒక బ్యాంక్ అకౌంట్‌ను, దాతలు, పూర్వ విద్యార్థుల విరాళం నిర్వహణ కొరకు మరొక బ్యాంకు అకౌంట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలో కనీసం 10 మంది పూర్వ విద్యార్థులతో పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో ఉన్న అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత,ఈ ఈ పంచాయతీ రాజ్ రెహ్మాన్, ఈ ఈ మిషన్ భగీరథ శేఖర్ రెడ్డి మండల ప్రత్యేక అధికారులు, డి.ఈ.లు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed