తెలంగాణకు మరో కంపెనీను ఆహ్వానించిన కేటీఆర్.. సహాయం అందిస్తామని హామీ

by Disha Web Desk 19 |
తెలంగాణకు మరో కంపెనీను ఆహ్వానించిన కేటీఆర్.. సహాయం అందిస్తామని హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత, గమ్యస్థానంగా తెలంగాణ ఉద్భవించిందని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్ కాన్ సంస్థను ఆహ్వానించారు. ప్రభుత్వం తరుపున పూర్తి సహాయసహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియు, కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణ రోడ్లతో పాటు పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని, పరిశ్రమల స్థాపనకు అనుగుణంగా ఉందన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తెలంగాణలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయని వెల్లడించారు.

ఎలక్ట్రానిక్స్‌ తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎంప్లాయర్‌లలో ఫాక్స్‌కాన్‌ ఒకటి అని, ఈవీ తయారీలో కూడా ప్రవేశించాలనే నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి సాధ్యమైనంత ఉత్తమమైన సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలోని వసతులను పరిశీలిచేందుకు కంపెనీ బృందాన్ని ఆహ్వానించారు. అదే విధంగా తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు వీలు కల్పించే పర్యావరణం మరియు మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కేటీఆర్ వివరించారు. చైర్మన్ యంగ్ లియు మాట్లాడుతూ.. భారత్ పరిశ్రమలకు ఆకర్షణీయమైన తయారీ గమ్యస్థానం అన్నారు. తెలంగాణ రాష్ట్రం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed